Home Latest News Lithium | భారీగా తగ్గనున్న స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. కారణమిదే

Lithium | భారీగా తగ్గనున్న స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు.. కారణమిదే

Lithium | భారతదేశంలో భారీగా లిథియం నిల్వలు బయటపడ్డాయి. జమ్మూకశ్మీర్‌లో 59 టన్నుల లిథియం నిల్వలను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రిసాయి జిల్లాలోని సలాల్ హైమానా ప్రాంతంలో ఈ నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన పరిశోధనలో బయటపడిందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా లిథియం, బంగారంతో పాటు ఇతర ఖనిజాలు కలిగిన 51 క్షేత్రాలను గుర్తించినట్లు తెలిపింది. 2018 -19 మధ్య నిర్వహించిన సర్వేల ఆధారంగా వీటిని గుర్తించినట్లు పేర్కొంది.

స్మార్ట్ ఫోన్ బ్యాటరీలతో పాటు, ఈవీ వెహికిల్స్ బ్యాటరీల తయారీలో లిథియం కీలకమైనది. భవిష్యత్తులో ఇంధన కొరతను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం కొద్దిరోజులుగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పలు రాయితీలను ప్రకటిస్తోంది. అయితే ఈవీ వెహికిల్స్ బ్యాటరీ తయారీలో కీలకమైన లిథియం మూలకం మన దగ్గర అందుబాటులో లేకపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దీని వల్ల ఈవీ వెహికిల్స్ ధరలు అధికంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు భారీ స్థాయిలో లిథియం మూలకం నిల్వలు బయటపడంతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి బలం చేకూరినట్టయింది. దేశీయంగానే లిథియం దొరకడంతో బ్యాటరీల ధరలు తగ్గిపోతాయి. ఫలితంగా ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్‌ఫోన్ల ధరలు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా గుర్తించిన 51 ఖనిజ క్షేత్రాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు గనుల శాఖ అప్పగించింది. వీటిలో 5 క్షేత్రాల్లో బంగారం నిల్వలు మిగిలిన చోట్ల పొటాష్, మాలబ్డినం, ఇతర ప్రాథమిక లోహాలను గుర్తించారు.

51 మినరల్‌ బ్లాకులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. ఇందులో ఒకటి లిథియం, 5 బ్లాక్ లు బంగారానికి సంబంధించినవి కాగా.. మిగిలిన బ్లాక్స్‌లో పొటాష్, మాలిబ్డినం,బేస్ మెటల్స్ మొదలైన ఖనిజాల బ్లాకులు ఉన్నాయి. ఇవి జమ్మూకశ్మీర్‌తో పాటు ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడులో ఉన్నాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Viral news | భార్యను పెట్రోల్‌ బంక్‌ దగ్గర వదిలేసి.. పరాయి వ్యక్తి భార్యను బైక్‌పై ఎక్కించుకెళ్లిన భర్త

Formula-E Race | ఫార్ములా-ఈ ట్రాక్‌పైకి రయ్‌మంటూ దూసుకొచ్చిన ప్రైవేటు వాహనాలు.. రేసర్లకు హైదరాబాద్ వాసుల షాక్‌

Ration Cards | తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం

Telangana Assembly | వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

CM KCR | ఇకపై పోడు భూములకు రైతుబంధు.. ఆదివాసీలకు గిరిజనబంధు.. తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

Bandi Sanjay | సచివాలయం డోమ్‌లు కూల్చేస్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Exit mobile version