Home Latest News Telangana Assembly | వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

Telangana Assembly | వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

Telangana Assembly | పలు కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. గిరిజనులు, ఆదివాసీలకు శుభవార్త తెలిపారు. వాళ్లు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇస్తామని ప్రకటించారు. పట్టాలు ఇవ్వడంతో పాటు రైతుబంధు కూడా ఇస్తామని తెలిపారు. భూమి లేని గిరిజనులకు గిరిజన బంధు కూడా ఇస్తామని తెలిపారు. వీటితో పాటు వాల్మీకి బోయ, బేదర, కిరాకత, నిషాది, పెద్ద బోయ, తలయారి, చుండువాళ్లు, కాయతి లంబాడ, బాట్ మదురాలు, చమూర్ మదురాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

వాల్మీకి బోయ, బేదర, కిరాకత, నిషాది, పెద్ద బోయ, తలయారి, చుండువాళ్లు, కాయతి లంబాడ, బాట్ మదురాలు, చమూర్ మదురాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని 2016లో షెడ్యూల్డ్ తెగల ఎస్టీ సంఘం విచారణ చేసిన సిఫారసును తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిందని ఈ సందర్బంగా కేసీఆర్ తెలిపారు. ఆ ప్రతిపాదనను భారత ప్రభుత్వానికి సమర్పించినదని అన్నారు. కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈ సామాజికవర్గాలను ఎస్టీ జాబితాలో చేర్చాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుందని తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాలలో నివసిస్తున్న మాలి సామాజికవర్గం ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతున్నది. వాళ్ల ఆర్థిక, సామాజిక స్థితిగతులను పరిగణలోకి తీసుకొని వారిని కూడా ఎస్టీ జాబితాలోచేర్చాలని కోరుతూ తీర్మానం చేసింది. అని తెలిపారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

CM KCR | ఇకపై పోడు భూములకు రైతుబంధు.. ఆదివాసీలకు గిరిజనబంధు.. తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

Bandi Sanjay | సచివాలయం డోమ్‌లు కూల్చేస్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

TSRTC | పెళ్లిళ్ల సీజన్‌లో టీఎస్ ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్‌!

Cow Hug Day | లవర్స్‌కి అలర్ట్‌.. భారత్‌లో ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కాదట.. కౌ హగ్‌ డేనట.. అందరూ ఇలా చేయాలన్న పశుసంవర్ధక శాఖ!

Narendra Modi | దేశం కోసమే నా జీవితం అంకితం చేశా.. కాంగ్రెస్‌ వల్ల దశాబ్ద కాలాన్ని కోల్పోయాం.. కాంగ్రెస్‌పై మోదీ ఫైర్‌!

Transgender Pregnant | పండంటి బిడ్డకు జన్మినిచ్చిన అబ్బాయి.. సోషల్‌ మీడియా ద్వారా ఆనందాన్ని పంచుకున్న అతని భార్య

Exit mobile version