Home Latest News Telangana Secretariat | తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా

Telangana Secretariat | తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా

Image Source: Telangana CMO Facebook

Telangana Secretariat | తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తామని ప్రకటించింది. సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 17 కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని ముందుగా నిర్ణయించారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈలోపు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయక తప్పలేదు.

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలోని 2 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయల, 8 స్థానిక సంస్థలకు అలాగే.. తెలంగాణలో ఒక ఉపాధ్యాయ, ఒక స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనుండటంతో ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 13న ఎన్నికల పోలింగ్.. 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Formula-E Race | ఫార్ములా-ఈ ట్రాక్‌పైకి రయ్‌మంటూ దూసుకొచ్చిన ప్రైవేటు వాహనాలు.. రేసర్లకు హైదరాబాద్ వాసుల షాక్‌

Ration Cards | తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం

Telangana Assembly | వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

CM KCR | ఇకపై పోడు భూములకు రైతుబంధు.. ఆదివాసీలకు గిరిజనబంధు.. తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన

Bandi Sanjay | సచివాలయం డోమ్‌లు కూల్చేస్తాం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Exit mobile version