Home News International COVID19 | చైనాలో మళ్లీ కరోనా విజృంభణ.. ఏప్రిల్ నాటికి 30 శాతం మందికి కొవిడ్...

COVID19 | చైనాలో మళ్లీ కరోనా విజృంభణ.. ఏప్రిల్ నాటికి 30 శాతం మందికి కొవిడ్ వచ్చే ఛాన్స్

COVID19 | చైనా (china )లో మళ్లీ కరోనావైరస్ విజృంభిస్తోంది. కొవిడ్ కేసులు ఇలాగే పెరిగిన వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నాటికి అక్కడ గరిష్ఠ కేసులు నమోదవుతాయని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యులయేషన్ (IHME) పరిశోధకులు అంచనా వేశారు. చైనా జనాభాలో మూడింట ఒక వంతు ప్రజలు ఈ మహమ్మారి బారిన పడతారని IHME డైరెక్టర్ క్రిస్టఫర్ ముర్రే వెల్లడించారు.

2023 నాటికి కరోనా మరణాల సంఖ్య 3.22 లక్షలకు చేరుకుంటుందని ముర్రే తెలిపారు.ఇటీవల కరోనా కేసులు పెరిగిపోతుండటంతో చైనా ప్రభుత్వం జీరో కొవిడ్ ఆంక్షలను తీసుకొచ్చింది. కానీ ఆ నిబంధనలపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ఆంక్షలను చైనా సడలించింది. దీనివల్ల 2023 నాటికి దాదాపు పది లక్షలకు పైగా మరణాలు సంభవించవచ్చని ఐహెచ్‌ఎంఈ అభిప్రాయపడింది. తొలుత బయటపడిన కరోనా వేరియంట్లకు జీరో కొవిడ్ విధానం సమర్థంగా పనిచేసి ఉండొచ్చు.. కానీ ఒమిక్రాన్ వంటి వేరియంట్ల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వీటికి జీరో కొవిడ్ విధానం కొనసాగించడం అసాధ్యమని ముర్రే అభిప్రాయపడ్డారు.

తమ దేశంలో కరోనా కేసులు, మరణాలకు సంబంధించి చైనా నేషనల్ హెల్త్ అథారిటీ చివరిసారిగా డిసెంబర్ 3న నివేదిక బయటపట్టింది. జీరో కొవిడ్ విధానాన్ని ఎత్తివేసినప్పటి నుంచి ఇప్పటివరకు చైనా అధికారికంగా కరోనా కేసుల వివరాలను వెల్లడించలేదు. ఇప్పటివరకు చైనా అధికారిక లెక్కల ప్రకారం ఆదేశంలో 5235 కొవిడ్ మరణాలు చోటు చేసుకున్నాయి. ఇక జీరో కొవిడ్ విధానం ఎత్తివేసిన తర్వాత ఆ దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువైందని తెలుస్తోంది. పైగా ఇంకా రెండు వారాల్లో క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలు ఉండటంతో కొవిడ్ వ్యాప్తి ఎలా ఉండబోతుందోనని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Fire Accident | మంచిర్యాల జిల్లాలో ఆరుగురు సజీవ దహనం.. ప్రమాదమా? కావాలనే నిప్పు పెట్టారా?

Pilot Rohit reddy | ఈడీ నోటీసులపై స్పందించిన పైలెట్‌ రోహిత్‌ రెడ్డి.. యాదగిరిగుట్టలో తడిబట్టలతో ప్రమాణం చేస్తా

Bandi Sanjay | తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై బండి సంజయ్‌ కామెంట్స్‌.. సిద్ధంగా ఉండాలంటూ నేతలకు సూచన

Harish Rao | బీజేపీ సర్కారు అవార్డులు రద్దు చేసినా చేస్తది.. బీజేపీ తీరుపై హరీశ్‌ రావు సెటైర్‌

Avatar2 Review | అవతార్ 2 రివ్యూ.. జేమ్స్ కామెరూన్ మరోసారి మాయ చేశాడా?

Exit mobile version