Home Latest News Pilot Rohit reddy | ఈడీ నోటీసులపై స్పందించిన పైలెట్‌ రోహిత్‌ రెడ్డి.. యాదగిరిగుట్టలో తడిబట్టలతో...

Pilot Rohit reddy | ఈడీ నోటీసులపై స్పందించిన పైలెట్‌ రోహిత్‌ రెడ్డి.. యాదగిరిగుట్టలో తడిబట్టలతో ప్రమాణం చేస్తా

Pilot Rohit reddy | ఈడీ జారీ చేసిన నోటీసులకు భయపడేదే లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి స్పష్టం చేశారు. కక్ష పూరితంగా నోటీసులు పంపించారని అన్నారు. ఈడీ ( Enforcement Directorate ) పంపిన నోటీసుల్లో బయోడేటా అడగటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈడీ నోటీసులకు భయపడబోనన్న రోహిత్‌ రెడ్డి.. తగ్గేదే లేదని అన్నారు.

లీగల్‌ ఓపీనియన్‌ తీసుకుని.. నోటీసులపై ముందుకు వెళతానన్నారు. బెంగళూరు డ్రగ్స్‌ కేసులో ఎవరూ తనకు నోటీసులు ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజీపీ కుట్రను బయటపెట్టినందుకే నోటీసులు ఇచ్చారన్న రోహిత్‌.. ఎలాంటి తప్పు చేయకుంటే తుషార్‌, బీఎల్‌ సంతోష విచారణకు ఎందుకు హాజరుకావడంలేదని ప్రశ్నించారు. ఇద్దరూ విచారణకు హాజరు కావాలని డిమాండ్‌ చేశారు. డ్రగ్స్‌ కేసులో తనకు కర్ణాటక నుంచి నోటీసులు రాలేదన్న రోహిత్‌.. యాదగిరిగుట్టలో తడి బట్టలతో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. బండి సంజయ్‌ కూడా తడిబట్టలతో యాదగిరిగుట్టకు వస్తాడా అని సవాల్‌ విసిరారు. వస్తే ఎప్పుడు వస్తాడో డేట్‌ చెప్పాలన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పిన రెండు రోజులకే ఈడీ నోటీసులు వచ్చాయని, తనకు నోటీసు వచ్చే విషయం ఎట్లా తెలుసని ప్రశ్నించారు. దీనిపై బండిపై కేసు వేస్తానని అన్నారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపించాలని కోరారు. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ గుట్టురట్టు చేసినందుకే ఈడీ తాజాగా నోటీసులు ఇచ్చిందని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేకే బీజేపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందన్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Bandi Sanjay | తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై బండి సంజయ్‌ కామెంట్స్‌.. సిద్ధంగా ఉండాలంటూ నేతలకు సూచన

Harish Rao | బీజేపీ సర్కారు అవార్డులు రద్దు చేసినా చేస్తది.. బీజేపీ తీరుపై హరీశ్‌ రావు సెటైర్‌

Jaishankar in UN | పెరట్లోనే పాములు పెంచి ఇతరులనే కాటేయాలంటే ఎలా.. పాకిస్థాన్‌ జర్నలిస్టుకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కౌంటర్

Drug case | డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కూడా

BRS Party | ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ ఆఫీసును ప్రారంభించిన కేసీఆర్‌.. హాజరైన అఖిలేష్‌ యాదవ్‌, కుమారస్వామి

KCR Inaugurate BRS party office | ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్‌.. వాస్తుకు అనుగుణంగా జరుగుతున్న మార్పులు

Exit mobile version