Home News International America-China War | రెండేళ్లలో అమెరికా, చైనా మధ్య యుద్ధం.. యూఎస్ ఎయిర్ ఫోర్స్ జనరల్...

America-China War | రెండేళ్లలో అమెరికా, చైనా మధ్య యుద్ధం.. యూఎస్ ఎయిర్ ఫోర్స్ జనరల్ సంచలన వ్యాఖ్యలు!

Image Source: Pixabay

America-China War | రాబోయే రెండు సంవత్సరాలలో అగ్రరాజ్యమైన అమెరికాతో చైనా యుద్ధం చేసే అవకాశాలు ఉన్నట్లు యూఎస్‌ ఎయిర్‌ ఫోర్స్‌ జనరల్‌ మైఖేల్‌ మినిహాన్‌ అన్నారు. ఇరు దేశాల మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. వాణిజ్య యుద్ధం నడుస్తోంది.ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడు, తైవాన్‌ విషయంలో చైనా విధానం నేపథ్యంలో డ్రాగన్‌ కంట్రీ పై ఎప్పటి నుంచో అమెరికా గుర్రుగా ఉంది. ఈ మేరకు సైనిక సిబ్బందికి ఆయన ఓ లేఖ రాశారు. తైవాన్ లోకి ఇటీవల చైనా చొరబాట్లు ఎక్కువ అయ్యాయి. దీంతో యూఎస్‌ వైమానిక దళం నుంచి హెచ్చరిక వచ్చింది.

ఈ క్రమంలోనే ఆయన 2025లో డ్రాగన్‌ కంట్రీతో యుద్ధం చేయాల్సి వస్తుందేమోనని అనుకుంటున్నట్లు ఆయన అన్నారు. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని లేఖలో సైనికులకు సూచించారు. చైనా ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు అవసరమైతే దాన్ని ఓడించడమే అమెరికా ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన లేఖ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

దీంతో ఇది వివాదాస్పదం అయ్యింది. ఈ క్రమంలోనే సీనియర్‌ సైనిక అధికారులు వివరణ ఇచ్చారు. అమెరికా, తైవాన్‌ లో 2024లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ సమయంలో తైవాన్‌ పై దాడికి చైనా తన సైనిక వ్యవహారాలను తీవ్రతరం చేస్తుందని ఈ సందర్భంగా పేర్కొంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Odisha Health Minister | ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య శాఖ మంత్రి మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒడిశా సీఎం

Hindenburg Research | కుబేరుల జాబితానే తలకిందులు చేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌.. గౌతమ్ అదానీ షేర్ల పతనం వెనుక ఆయనే !

Australian Open | సంచలనం సృష్టించిన నొవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డును సమం చేసిన సెర్బియా దిగ్గజం

mobiles on plane | విమానం ఎక్కగానే మొబైల్‌ స్విచ్చాఫ్‌ చేయమని ఎందుకు చెబుతారు?

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

Legal Advice | భర్త కనిపించకుండా పోతే భార్యకు ఆస్తి దక్కుతుందా? దీనికి ఏం చేయాలి?

Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Exit mobile version