Saturday, July 13, 2024
- Advertisment -
HomeEntertainmentCostumes Krishna | ఆయన వల్లే కాస్ట్యూమర్‌గా బిజీగా ఉన్న కృష్ణ.. నటుడిగా మారాల్సి వచ్చింది!

Costumes Krishna | ఆయన వల్లే కాస్ట్యూమర్‌గా బిజీగా ఉన్న కృష్ణ.. నటుడిగా మారాల్సి వచ్చింది!

Costumes Krishna | తెలుగు ఇండస్ట్రీలో కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా కాస్ట్యూమ్‌ కృష్ణకు తిరుగులేని రోజులు అవి. ఆ టైమలో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా తీరికలేకుండా గడిపేసేవాడు. కనీసం కుటుంబంతో కూడా గడిపేందుకు సమయం కేటాయించలేకపోయాడు. అలాంటి సమయంలో కాస్ట్యూమ్‌ కృష్ణ డైరెక్టర్‌ కోడి రామకృష్ణ కంట్లో పడ్డాడు. కాస్ట్యూమ్‌ కృష్ణను చూసిన తొలిసారే ఆయనలో ఏదో మ్యాజిక్‌ ఉందని అనుకున్నాడు.

కాస్ట్యూమ్‌ కృష్ణ రూపం, బాడీ లాంగ్వేజి చూసి అతనిలో ఏదో ప్రత్యేకత ఉందని కోడి రామకృష్ణ భావించాడు. అతనిలో గొప్ప నటుడయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని గుర్తించాడు. వెంటనే కాస్ట్యూమ్‌ కృష్ణకు నటుడిగా ట్రై చేయమని చెప్పాడు. తన సినిమాలో క్యారెక్టర్‌ ఉంది చేయమని అడిగాడు. కానీ కాస్ట్యూమ్‌ కృష్ణ ఒప్పుకోలేదు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా ఫుల్‌ బిజీగా ఉన్నా.. ఇలాంటి టైమ్‌లో నటించడానికి కుదరదని కరాఖండీగా చెప్పేశాడు. అసలు తనకు నటించే ఇంట్రెస్ట్‌ కూడా లేదని అన్నాడు. అయినా కోడి రామకృష్ణ మాత్రం అస్సలు విడిచిపెట్టలేదు. ఎలాగైనా అతనితో నటింపజేయాలని మొండిపట్టు పట్టాడు. ఈ విషయం కాస్ట్యూమ్‌ కృష్ణ తన ఇంట్లో వాళ్లకు కూడా తెలిసింది.

మొదట్నుంచి సినిమా తీయాలని కాస్ట్యూమ్‌ కృష్ణ ఆశపడేవాడు. కానీ దానికి కావాల్సినంత డబ్బు లేదు. అందుకే కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా బిజీగా గడిపేశాడు. కాస్ట్యూమ్స్‌ కంటే కూడా యాక్టింగ్‌ అయితే ఎక్కువ సంపాదించవచ్చని ఇంట్లో వాళ్లు, అలాగే బయట కొంతమంది ఆయనకు సలహా ఇచ్చారు. భార్యాపిల్లలు కూడా నటుడిగా చేయమని ప్రోత్సహించారు. వీళ్లందరి ప్రోద్బలంతో కాస్ట్యూమ్‌ కృష్ణ నటించేందుకు అంగీకరించాడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన భారత్‌ బంద్‌ సినిమాలో విలన్‌ పాత్రలో నటించాడు. మొదటి సినిమాతోనే విలన్‌గా మెప్పించాడు. అప్పటివరకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గానే చూసిన కృష్ణలో ఇంత టాలెంట్‌ ఉందా అని ఆశ్చర్యపోయారు. ఇంకేముంది అప్పట్నుంచి కాస్ట్యూమ్‌ కృష్ణకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

అలా సినిమాల్లో నటించగా వచ్చిన డబ్బులతో నిర్మాతగా కూడా మారాడు కాస్ట్యూమ్‌ కృష్ణ. సూపర్‌ స్టార్‌ కృష్ణతో అశ్వత్ధామ సినిమా తీసి నిర్మాతగా సత్తా చాటుకున్నాడు. ఆ సినిమా తర్వాత పెళ్లాం చెబితే వినాలి, మా ఊరు మారదు, పుట్టింటికి రా చెల్లి, పెళ్లి పందిరి వంటి హిట్‌ సినిమాలను తెరకెక్కించాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Costume Krishna | ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్‌ కృష్ణ మృతి

Vande Bharat | సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి ఇక చాలా స్పీడ్‌గా వెళ్లొచ్చు.. ఇదీ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ షెడ్యూల్‌

IPL 2023 | పంజాబ్‌ కింగ్స్‌ శుభారంభం.. వర్షం కారణంగా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో కోల్‌కతా ఓటమి

Sunrisers Hyderabad | మూడేండ్ల తర్వాత ఉప్పల్‌లో ఐపీఎల్‌ పోరు.. రాజస్థాన్‌ రాయల్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఢీ

TSRTC | సామాన్యులకు షాక్‌.. కేంద్రం నిర్ణయంతో బస్సు ఛార్జీలు పెంచేసిన టీఎస్‌ఆర్టీసీ

Balagam | ఫస్ట్ మూవీతోనే కమెడియన్ వేణు అదరగొట్టేశాడుగా.. బలగం మూవీకి రెండు అంతర్జాతీయ అవార్డులు

IPL 2023 | ఐపీఎల్‌లో గుజరాత్‌ శుభారంభం.. 5 వికెట్ల తేడాతో చెన్నైని చిత్తుచేసిన హర్దిక్‌ సేన

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News