Tuesday, April 23, 2024
- Advertisment -
HomeLatest NewsSunrisers Hyderabad | మూడేండ్ల తర్వాత ఉప్పల్‌లో ఐపీఎల్‌ పోరు.. రాజస్థాన్‌ రాయల్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌...

Sunrisers Hyderabad | మూడేండ్ల తర్వాత ఉప్పల్‌లో ఐపీఎల్‌ పోరు.. రాజస్థాన్‌ రాయల్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఢీ

Sunrisers Hyderabad | టైమ్‌ 2 న్యూస్‌, హైదరాబాద్‌: మూడేండ్ల తర్వాత హైదరాబాద్‌లో జరుగనున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. కరోనా కారణంగా 2019 నుంచి హైదరాబాద్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగలేదు. ఐపీఎల్‌-16వ సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ జట్టు ఆదివారం తొలిసారి బరిలోకి దిగనుంది.

ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో వేదికగా.. రాజస్థాన్‌ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. గత సీజన్‌లతో పోలిస్తే హైదరాబాద్‌ జట్టులో పలు మార్పులు సంభవించగా.. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ ఎయిడెన్‌ మార్కర్‌మన్‌ ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు నాయకత్వం వహించనున్నాడు. అయితే దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌ సిరీస్‌ కారణంగా అతడు తొలి మ్యాచ్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. నైపుణ్యం గల ఆటగాళ్లతో నిండి ఉన్న రైజర్స్‌.. సొంతగడ్డపై జరుగుతున్న తొలి మ్యాచ్‌లో సత్తాచాటాలని కృతనిశ్చయంతో ఉంది.

గతేడాది చక్కటి ప్రదర్శనతో రన్నరప్‌గా నిలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ అదే జోరు ఈ సారి కూడా కొనసాగించాలని భావిస్తున్నది. నిరుడు అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌ అందుకునే పర్పుల్‌ క్యాప్‌, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌ అందుకునే ఆరెంజ్‌ క్యాప్‌ రెండూ కూడా రాజస్థాన్‌ ప్లేయర్లే దక్కించుకున్నారు. బౌలింగ్‌లో యుజ్వేంద్ర చాహల్‌ దుమ్మురేపితే.. బ్యాటింగ్‌లో జోస్‌ బట్లర్‌ అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాన విషయం తెలిసిందే.

బ్యాటింగ్‌ బౌలింగ్‌లో సమతూకంగా ఉన్న రాజస్థాన్‌పై విజయం సాధించాలంటే హైదరాబాద్‌ శక్తికి మించి పోరాడాల్సిన అవసరం ఉంది. గతేడాది వరకు జట్టుకు సారథ్యం వహించిన కేన్‌ విలియమ్సన్‌ను రైజర్స్‌ వేలానికి వదిలేసుకోగా.. ఇప్పుడు ఇంగ్లండ్‌ యువ బ్యాటర్‌ బ్రూక్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహన్‌ వెల్లడించగా.. 1500 మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్‌ నియంత్రణ కోసం కూడా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10.30 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.

గతేడాది పంజాబ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్‌ అగర్వాల్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగనుండగా.. రాహుల్‌ త్రిపాఠి, గెన్‌ ఫిలిప్స్‌, అబ్దుల్‌ సమద్‌, వాషింగ్టన్‌ సుందర్‌ బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. ఎప్పట్లాగే.. సన్‌ రైజర్స్‌ బౌలింగ్‌ మెరుగ్గా కనిపిస్తోంది. స్టాండిన్‌ కెప్టెన్‌ భువనేశ్వర్‌తో పాటు ఉమ్రాన్‌ మాలిక్‌, నటరాజన్‌ పేస్‌ భారాన్ని మోయనున్నారు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా ఇంగ్లండ్‌ ప్లేయర్‌ ఆదిల్‌ రషీద్‌ అందుబాటులో ఉన్నాడు. అయితే గతంలో మాదిరిగా ఇన్నింగ్స్‌ ఆసాంతం నిలకడగా రాణించగలిగే యాంకర్‌ వంటి బ్యాటర్‌ లేకపోవడం సన్‌రైజర్స్‌కు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. వేలంలో భారీ ధర పెట్టి కొనుగోలు చేసుకున్న బ్రూక్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేది కీలకం.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

IPL 2023 | పంజాబ్‌ కింగ్స్‌ శుభారంభం.. వర్షం కారణంగా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో కోల్‌కతా ఓటమి

TSRTC | సామాన్యులకు షాక్‌.. కేంద్రం నిర్ణయంతో బస్సు ఛార్జీలు పెంచేసిన టీఎస్‌ఆర్టీసీ

Balagam | ఫస్ట్ మూవీతోనే కమెడియన్ వేణు అదరగొట్టేశాడుగా.. బలగం మూవీకి రెండు అంతర్జాతీయ అవార్డులు

IPL 2023 | ఐపీఎల్‌లో గుజరాత్‌ శుభారంభం.. 5 వికెట్ల తేడాతో చెన్నైని చిత్తుచేసిన హర్దిక్‌ సేన

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News