Friday, March 29, 2024
- Advertisment -
HomeEntertainmentCostume Krishna | మాదాసు కృష్ణ.. కాస్ట్యూమ్‌ కృష్ణగా ఎలా మారాడు.. ఇదీ పేరు వెనక...

Costume Krishna | మాదాసు కృష్ణ.. కాస్ట్యూమ్‌ కృష్ణగా ఎలా మారాడు.. ఇదీ పేరు వెనక స్టోరీ !

Costume Krishna | ఎన్నో చిత్రాల్లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మెప్పించిన కాస్ట్యూమ్‌ కృష్ణ అసలు పేరు అది కాదు. ఆయన అసలు పేరు మాదాసు కృష్ణ. కానీ సినీ ఇండస్ట్రీలో మాత్రం కాస్ట్యూమ్‌ కృష్ణగానే పాపులారిటీ సంపాదించాడు. దీనివెనుక ఇంట్రెస్టింగ్‌ స్టోరీ ఉంది.

విజయనగరం జిల్లా లక్కవరపుకోటకు చెందిన మాదాసు కృష్ణ ఉపాధి కోసం 1954లో మద్రాసు పట్టణానికి వెళ్లాడు. అక్కడ సినిమాలకు పనిచేసే కాస్ట్యూమర్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండటంతో కాస్ట్యూమ్‌ డిజైన్స్‌లోనూ తన ప్రతిభ చాటాడు. అతని సత్తా చూసిన ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు తన నిర్మాణ సంస్థలో అవకాశం ఇచ్చాడు. ఫుల్‌ టైమ్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా రామానాయుడు స్టూడియోలో సెటిల్‌ అయిపోయాడు. అక్కడ తన టాలెంట్‌ను చూపించి అగ్ర హీరో హీరోయిన్లకు ఫేవరెట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా మారిపోయాడు.

ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, చిరంజీవి, వాణిశ్రీ, జయసుధ, శ్రీదేవి వంటి అగ్ర నటీనటులు ఎంతోమందికి ఆయన కాస్ట్యూమ్స్‌ అందించాడు. ఆ ట్రెండ్స్‌కు విపరీతమైన క్రేజ్‌ ఉండేది. ఎప్పటికప్పుడు మారుతున్న ఫ్యాషన్‌కు అనుగుణంగా బెల్‌ బాటమ్‌ ప్యాంట్స్‌ నుంచి బ్యాగీ ప్యాంట్స్‌ వరకు హీరోలకు అందించాడు. సినిమాలు రిలీజయ్యాక అవి ట్రెండ్‌ను క్రియేట్‌ చేశాయి. అలా చాలా ఏళ్ల పాటు తిరుగులేని కాస్ట్యూమర్‌గా కృష్ణ పేరు తెచ్చుకున్నాడు. అందుకే ఇండస్ట్రీలో అందరూ ముద్దుగా కాస్ట్యూమ్‌ కృష్ణ అని పిలిచేవారు. అదే అతని అసలు పేరుగా స్థిరపడిపోయింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Costume Krishna | ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్‌ కృష్ణ మృతి

Vande Bharat | సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి ఇక చాలా స్పీడ్‌గా వెళ్లొచ్చు.. ఇదీ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ షెడ్యూల్‌

IPL 2023 | పంజాబ్‌ కింగ్స్‌ శుభారంభం.. వర్షం కారణంగా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో కోల్‌కతా ఓటమి

Sunrisers Hyderabad | మూడేండ్ల తర్వాత ఉప్పల్‌లో ఐపీఎల్‌ పోరు.. రాజస్థాన్‌ రాయల్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఢీ

TSRTC | సామాన్యులకు షాక్‌.. కేంద్రం నిర్ణయంతో బస్సు ఛార్జీలు పెంచేసిన టీఎస్‌ఆర్టీసీ

Balagam | ఫస్ట్ మూవీతోనే కమెడియన్ వేణు అదరగొట్టేశాడుగా.. బలగం మూవీకి రెండు అంతర్జాతీయ అవార్డులు

IPL 2023 | ఐపీఎల్‌లో గుజరాత్‌ శుభారంభం.. 5 వికెట్ల తేడాతో చెన్నైని చిత్తుచేసిన హర్దిక్‌ సేన

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News