Thursday, April 25, 2024
- Advertisment -
HomeEntertainmentBalagam | ఫస్ట్ మూవీతోనే కమెడియన్ వేణు అదరగొట్టేశాడుగా.. బలగం మూవీకి రెండు అంతర్జాతీయ అవార్డులు

Balagam | ఫస్ట్ మూవీతోనే కమెడియన్ వేణు అదరగొట్టేశాడుగా.. బలగం మూవీకి రెండు అంతర్జాతీయ అవార్డులు

Balagam | జబర్దస్త్‌ కమెడియన్‌ వేణు యెల్దండి డైరెక్టర్‌గా మారిన తీసిన చిత్రం బలగం. కమెడియన్‌ తీసిన చిత్రం అంటే ఏదో కామెడీ చిత్రమే తీస్తారేమో అని రిలీజ్‌కు ముందు అంతా అనుకున్నారు. కానీ స్వచ్ఛమైన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో పాటు కుటుంబ బంధాలను చాలా చక్కగా చూపించాడు. సినిమా చూసిన వాళ్లందరితో శభాష్‌ అని అనిపించుకున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సారథ్యంలో ఆయన కూతురు నిర్మించిన ఈ సినిమా మార్చి 3న విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాకు ఇప్పుడు కలెక్షన్లు మాత్రమే కాదు అవార్డులు కూడా వరిస్తున్నాయి. అది కూడా అంతర్జాతీయ అవార్డులు కావడం గమనార్హం.

చలన చిత్ర రంగంలో ప్రత్యేకంగా భావించి లాస్‌ఏంజెలిస్ సినిమాటోగ్రఫీ అవార్డుల కార్యక్రమంలో రెండు అవార్డులను బలగం మూవీ గెలుచుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిలిం విభాగానికి గానూ డైరెక్టర్ వేణు యెల్దండి, బెస్ట్ ఫీచర్ ఫిలిం సినిమాటోగ్రఫీ విభాగానికి గానూ ఆచార్య వేణు అవార్డులను దక్కించుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ దిల్ రాజు ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. డైరెక్టర్, సినిమాటోగ్రఫర్‌కు అభినందనలు తెలిపింది. ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న బలగం మూవీ అక్కడ కూడా మంచి ప్రశంసలు అందుకుంటుంది.

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News