Thursday, April 25, 2024
- Advertisment -
HomeEntertainmentCostume Krishna | ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్‌ కృష్ణ మృతి

Costume Krishna | ప్రముఖ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్‌ కృష్ణ మృతి

Costume Krishna | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ఎన్నో సినిమాలను నిర్మించి, నటుడిగా మెప్పించిన కాస్ట్యూమ్‌ కృష్ణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.

కాస్ట్యూమ్‌ కృష్ణ అనే పేరు ఎలా వచ్చిందంటే..

విజయనగరం జిల్లా లక్కవరపుకోటకు చెందిన మాదాసు కృష్ణ అలియాస్ కాస్ట్యూమ్‌ కృష్ణ విలన్‌గా, సహాయ నటుడిగా పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. సినిమాల మీద ఆసక్తితో 1954లో మద్రాసు వెళ్లిన మాదాస్‌ కృష్ణ.. సినిమా వాళ్ల దగ్గర అసిస్టెంట్‌ కాస్ట్యూమర్‌గా జాయిన్‌ అయ్యాడు. తక్కువటైమ్‌లోనే పేరు రావడంతో రామానాయుడు సంస్థలో ఫుల్‌ టైమ్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసే అవకాశాన్ని కొట్టేశాడు. అప్పట్నుంచి ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, చిరంజీవి వంటి ఎంతోమంది అగ్ర హీరోలకు, వాణిశ్రీ, జయసుధ, శ్రీదేవి వంటి స్టార్‌ హీరోయిన్స్‌కు ఆయన కాస్ట్యూమ్స్ అందించాడు. అప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా రకరకాల దుస్తులను అందించేవాడు. అవి హీరోలకు, యూత్‌కు విపరీతంగా నచ్చేవి. అలా వచ్చిన క్రేజ్‌తో మాదాసు కృష్ణ కాస్త కాస్ట్యూమ్‌ కృష్ణగా స్థిరపడ్డారు.

అలా నటనలోకి..


కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా మాదాసు కృష్ణ బిజీగా గడిపేస్తున్న సమయంలో కోడిరామకృష్ణ కంట పడ్డాడు. ఆయన బాడీ లాంగ్వేజి చూసి ఏదో ప్రత్యేకత ఉందని భావించాడు. తన సినిమాలో నటించమని అడిగాడు. కానీ కాస్ట్యూమ్‌ కృష్ణ మొదట్లో నిరాకరించాడు. కానీ కోడి రామకృష్ణ పట్టుబట్టడంతో పాటు.. భార్యాపిల్లలు కూడా ప్రోత్సహించడంతో నటుడిగా మారాడు. కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన భారత్‌ బంద్‌ సినిమాలో తొలిసారిగా నటించాడు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత అల్లరి మొగుడు, దేవుళ్లు, మా ఆయన బంగారం, పుట్టింటికి రా చెల్లి వంటి పలు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

నిర్మాతగా..

కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా, నటుడిగా సక్సెస్‌ కావడంతో నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుని సక్సెస్‌ అయ్యాడు కాస్ట్యూమ్‌ కృష్ణ. సూపర్‌ స్టార్‌ కృష్ణతో అశ్వత్ధామ కాస్ట్యూమ్‌ కృష్ణ తొలి సినిమా. ఆ తర్వాత పెళ్లాం చెబితే వినాలి. మా ఊరు మారదు, పుట్టింటికి రా చెల్లి, పెళ్లిపందిరి వంటి సినిమాలు తీశాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Vande Bharat | సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి ఇక చాలా స్పీడ్‌గా వెళ్లొచ్చు.. ఇదీ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ షెడ్యూల్‌

IPL 2023 | పంజాబ్‌ కింగ్స్‌ శుభారంభం.. వర్షం కారణంగా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో కోల్‌కతా ఓటమి

Sunrisers Hyderabad | మూడేండ్ల తర్వాత ఉప్పల్‌లో ఐపీఎల్‌ పోరు.. రాజస్థాన్‌ రాయల్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఢీ

TSRTC | సామాన్యులకు షాక్‌.. కేంద్రం నిర్ణయంతో బస్సు ఛార్జీలు పెంచేసిన టీఎస్‌ఆర్టీసీ

Balagam | ఫస్ట్ మూవీతోనే కమెడియన్ వేణు అదరగొట్టేశాడుగా.. బలగం మూవీకి రెండు అంతర్జాతీయ అవార్డులు

IPL 2023 | ఐపీఎల్‌లో గుజరాత్‌ శుభారంభం.. 5 వికెట్ల తేడాతో చెన్నైని చిత్తుచేసిన హర్దిక్‌ సేన

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News