Home Latest News Covid 19 vaccine side effects | కరోనా వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్‌ నిజమే.. అంగీకరించిన...

Covid 19 vaccine side effects | కరోనా వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్‌ నిజమే.. అంగీకరించిన ప్రభుత్వం.. ఏ వ్యాక్సిన్‌తో ఎలాంటి దుష్రభావాలు?

Image Source: Freepik

Covid 19 vaccine side effects | కొవిడ్‌ -19 వ్యాక్సిన్‌ దుష్రభావాలను ఇండియన్‌ కౌన్సిల్ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ( ICMR ), సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ అధికారికంగా అంగీకరించాయి. పూణెకి చెందిన వ్యాపారవేత్త ప్రఫుల్ సర్దాకు ఆర్టీఐ సమాధానంలో కొన్ని వివరాలను వెల్లడించారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దాఖలు చేసిన పిటిషన్‌కు బదులిస్తూ కేంద్రం ఇచ్చిన సమాధానం ఇప్పుడు దేశ ప్రజలను షాక్‌కు గురిచేస్తుంది. దేశంలో కరోనా కట్టడి కోసం తీసుకున్న కోవిషీల్డ్, కోవోవ్యాక్స్, కో వ్యాక్సిన్, ఆస్ట్రాజెనికా, స్పుత్నిక్ వి వంటి వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని పేర్కొంది.

వ్యాక్సిన్‌ దుష్ప్రభావాలు

కొవిషీల్డ్‌ వేసుకుంటే టీకా వేసిన చోట నొప్పి, దద్దర్లు కారణాల్లేకుండానే వాంతులు, పొత్తి కడుపులో నొప్పి, తలనొప్పి, శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది, ఛాతీనొప్పి, కాళ్ల నొప్పి, పక్షవాతం, మూర్చ, కళ్లలో నొప్పి, చూపు మందగించటం, మానసిక స్థితిలో మార్పు వంటివి చోటు చేసుకుంటాయి.

కొవాగ్జిన్‌ వేసుకుంటే టీకా వేసిన చోట నొప్పి, తలనొప్పి, జ్వరం, అలసట, ఒళ్లు నొప్పులు, పొత్తి కడుపులో నొప్పి, వికారం, వాంతులు, జలుబు, దగ్గు, కళ్లు తిరగడం, వణుకు వంటివి ఉంటాయి.

కొవొవ్యాక్స్‌ వేసుకుంటే ఇంజక్షన్‌ చేసిన చోట నొప్పి, దురద, అలసట, తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పి, కీళ్ల నొప్పులు, వాంతులు, ఒళ్లు నొప్పులు, శక్తి లేకపోవడం వెన్నులో నొప్పి, కళ్లు తిరగడం వంటివి ఉంటాయి.

స్పుత్నిక్‌ వీ వేసుకుంటే జ్వరం, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పి, శక్తి లేకపోవడం, తలనొప్పి, ఆకలి లేకపోవడం, వికారం, టీకా వేసిన చోట నొప్పి ఉంటాయి.

కార్బీ వ్యాక్స్‌ వేసుకుంటే టీకా వేసిన చోట నొప్పి, జ్వరం, తలనొప్పి, అలసట, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పి, వికారం, దద్దుర్లు, నిద్రమత్తు, ఉర్టికేరియా, చలి, బద్దకం వంటివి ఉంటాయని ఐసీఎమ్‌ఆర్‌ – సీడీఎస్‌సీఓ సమాధానం ఇచ్చింది.

దుష్ప్రభావాల గురించి తగిన ప్రచారం జరిగిందా లేదా?

వ్యాక్సినేషన్‌ పూర్తిగా స్వచ్ఛందం అని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, బస్సులు, రైళ్లు విమానాలు ప్రజలను బయటికి వెళ్లకుండా ఎందుకు ప్రజలను నిషేధించింది అంటూ సర్దా ఘాటుగా విమర్శలు చేశారు.

మీడియా ద్వారా, ఆసుపత్రులు, టీకా కేంద్రాల ద్వారా ఈ దుష్ప్రభావాల గురించి తగిన ప్రచారం జరిగిందా లేదా అనే దానిపై డేటాను విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ దుష్ప్రభాల గురించి చెప్పకుండా ప్రపంచ దేశాలకు కోట్లాది ఉచిత వ్యాక్సిన్‌లను భారతదేశం ఎలా విరాళంగా అందించిందని సర్దా ఉదహరించారు. ఈ సమస్యలను ఆ దేశాల ప్రజల దృష్టికి తీసుకువెళ్లారా అని ప్రశ్నించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Fact Check | ఆధార్ కార్డు ఉంటే మోదీ ప్రభుత్వం రూ.4.78 లక్షల లోన్ ఇస్తుందా? వైరల్ అవుతున్న మెసేజ్

PM Kisan | రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్‌లో పడేది అప్పుడే

Vivek Express | వందేభారత్‌ను మించిన వివేక్ ఎక్స్‌ప్రెస్ వచ్చేస్తోంది.. దీనికి మాత్రమే ఈ రికార్డు సొంతం !

Oxfam Report | అదానీ నాలుగేళ్ల సంపాదనపై పన్ను విధిస్తే.. 50 లక్షల మంది టీచర్లకు జీతాలివ్వొచ్చట.. ఆక్స్‌ఫామ్ నివేదిక

recession | ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం.. త్వరలోనే భారత్‌లో కూడా ఎఫెక్ట్.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

Pallavi Joshi | కశ్మీర్ ఫైల్స్ నటికి యాక్సిడెంట్.. గాయాలతోనే షూటింగ్‌లో పాల్గొన్న పల్లవి జోషి

vijay antony | మలేసియాలో షూటింగ్ స్పాట్‌లో తీవ్రంగా గాయపడ్డ బిచ్చగాడు హీరో

Hyderabad tragedy | పండుగపూట హైదరాబాద్‌లో విషాదం.. భార్యాపిల్లలను, తల్లిని చంపి వ్యక్తి బలవన్మరణం

Exit mobile version