Home Latest News recession | ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం.. త్వరలోనే భారత్‌లో కూడా ఎఫెక్ట్.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

recession | ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం.. త్వరలోనే భారత్‌లో కూడా ఎఫెక్ట్.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

recession | ప్రపంచం మొత్తాన్ని భయాందోళనలు గురి చేస్తున్న ఆర్థిక మాంద్యం త్వరలోనే భారత్‌ను తాకే అవకాశం ఉందని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణె సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ తర్వాత భారత్‌పై కూడా మాంద్యం ఎఫెక్ట్ ఉంటుందని పేర్కొన్నారు. దాని ప్రభావం పడకుండా ఉండేందుకు కేంద్రం యత్నాలు ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.

మహారాష్ట్రలోని పుణెలో జరిగిన జీ20 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి కేంద్రమంత్రి నారాయణ్ రాణే హాజరయ్యారు. ఈ సమావేశాలకు IWG సభ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి సుమారు 65 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్బంగా నారాయణ్ రాణె మాట్లాడుతూ.. పుణెకు మరిన్ని పరిశ్రమలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని నారాయణ్ రాణె తెలిపారు. జీ 20 సమావేశం అనేది దీర్ఘకాలిక, స్థిరమైన ఆర్థిక వృద్ధికి కీలకమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన చాలా దేశాలు ఇందులో పాలుపంచుకుంటున్నాయి. మనది కూడా అభివృద్ధి చెందిన దేశం కావాలి. మోదీని చూసి మనందరం గర్వపడాలి. ఎందుకంటే గడిచిన ఎనిమిది సంవత్సరాలలో మౌలిక సదుపాయాలు, ఇతర రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కేంద్రం అన్ని విధాల పని చేసింది. దాంతో వివిధ దేశాల దృష్టిని భారత దేశం ఆకర్షించిందని రాణే పేర్కొన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Hyderabad tragedy | పండుగపూట హైదరాబాద్‌లో విషాదం.. భార్యాపిల్లలను, తల్లిని చంపి వ్యక్తి బలవన్మరణం

nepal plane crash | నేపాల్‌లో విమానం కూలింది ఇలా.. ప్రమాదం జరిగే ముందు ఫేస్‌బుక్‌ లైవ్ పెట్టిన యూపీ యువకులు

Ambati Rambabu | నేను సంబరాల రాంబాబునే.. కానీ ప్యాకేజీ కోసం డ్యాన్స్ చేయను.. నాగబాబుపై ఏపీ మంత్రి అంబటి సెటైర్లు

Hyper Aadi | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హైపర్ ఆది పోటీ చేయబోతున్నాడా.. జనసేన తరఫున ఆ నియోజకవర్గం నుంచేనా ?

Kodi pandalu | ఏపీలో దారుణం.. ఇద్దరి ప్రాణాలు తీసిన కోడి కత్తి.. కోడి పందాలు చూస్తుండగా ఘటన

Exit mobile version