Home Latest News Corona Alert | కరోనా అలర్ట్.. అంతర్జాతీయ ప్రయాణీకులపై ఆంక్షలు విధించే యోచనలో కేంద్రం?

Corona Alert | కరోనా అలర్ట్.. అంతర్జాతీయ ప్రయాణీకులపై ఆంక్షలు విధించే యోచనలో కేంద్రం?

Corona Alert | కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. చైనా, అమెరికా, జపాన్, కొరియా సహా పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆధ్వర్యంలో జరుగుతున్న కీలక సమావేశంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల, ఆరోగ్య, ఆయుష్, ఔషధ, బయోటెక్నాలజీ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ ప్రయాణాలపై సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా చైనా కరోనా కేసులతో అతలాకుతలం అవుతోంది. ఆస్పత్రులన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. కరోనా పాజిటీవ్ కేసులు వస్తే.. జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాలని ఆదేశాలు జారీ చేసింది. కొత్త వేరియట్లను గుర్తించేందుకు వీలుగా పాజిటీవ్ నమూనాలకు సంబంధించిన పూర్తి జన్యు క్రమాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య వాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాశారు.

మాస్క్ మస్ట్..

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్కులు ధరించాలని కేంద్రం సూచించింది. కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ ఉన్న‌త అధికారుల‌తో సమావేశం తర్వాత మంత్రి ట్వీట్ చేశారు. కరోనా ఇంకా ముగిసిపోలేదని, అంద‌రూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని అన్నారు. ఎలాంటి ప‌రిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు.

ఒమిక్రాన్ వేరియంట్లు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు సంబంధించిన మార్గదర్శకాలపై కూడా తాజా సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. భారత్‌లో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4వేల లోపే ఉన్నప్పటికీ ప్రపంచ దేశాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అమెరికాలో ఇప్పటికే 10 కోట్ల కరోనా కేసులు దాటాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం అప్రమత్తమైంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Corona | ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోందా ? అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ !

China | చైనాలో కరోనా తెచ్చిన కష్టం.. నిమ్మకాయల కోసం ఎగబడుతున్న జనాలు.. కారణమిదే

COVID19 | చైనాలో మళ్లీ కరోనా విజృంభణ.. ఏప్రిల్ నాటికి 30 శాతం మందికి కొవిడ్ వచ్చే ఛాన్స్

Notice for Taj Mahal | చరిత్రలో తొలిసారి తాజ్‌మహల్‌కు నోటీసులు.. ఇంటి పన్ను, నీటి పన్ను చెల్లించాలంటూ ఆదేశాలు

Gas cylinder for Rs. 500 | రాజస్థాన్‌లో 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం.. ఏప్రిల్ 1 నుంచి అమలు

Mrs world | 21 ఏళ్ల తర్వాత భారత్‌కు దక్కిన మిసెస్ వరల్డ్ కిరీటం.. విజేతగా నిలిచిన వైజాగ్ టీచర్

Sazia Marri | మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని మరిచిపోవద్దు.. భారత్‌కు పాక్ వార్నింగ్

Exit mobile version