Home Latest News Mrs world | 21 ఏళ్ల తర్వాత భారత్‌కు దక్కిన మిసెస్ వరల్డ్ కిరీటం.. విజేతగా...

Mrs world | 21 ఏళ్ల తర్వాత భారత్‌కు దక్కిన మిసెస్ వరల్డ్ కిరీటం.. విజేతగా నిలిచిన వైజాగ్ టీచర్

pic credit: ani_digital twitter

Mrs world | అంతర్జాతీయ అందాల పోటీల్లో భారత్ సత్తా చాటింది. 21 ఏళ్ల తర్వాత భారత్‌కు సర్గమ్ కౌశల్ ( Sargam koushal ) మిసెస్ వరల్డ్ కిరీటాన్ని తెచ్చిపెట్టింది. దాదాపు 63 దేశాల మహిళలు పాల్గొన్న మిసెస్ వరల్డ్ ( Mrs world ) అందాల పోటీల్లో జమ్మూ కశ్మీర్‌కు చెందిన సర్గమ్ కౌశల్ కిరీటాన్ని దక్కించుకుంది. ఈ విషయాన్ని మిసెస్ ఇండియా పోటీ నిర్వహణ సంస్థ అధికారికంగా ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేసింది. సర్గమ్‌కు గత ఏడాది మిసెస్ వరల్డ్‌గా నిలిచిన అమెరికా మహిళ షాయలిన్ ఫోర్డ్ కిరీటాన్ని బహూకరించింది.

మిసెస్ వరల్డ్ 2022 పోటీల్లో పాలినేషియా, కెనడాకు చెందిన మహిళలు రన్నరప్‌గా నిలిచారు. కాగా, 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మిసెస్ వరల్డ్ కిరీటం దక్కడం సంతోషంగా ఉందని టైటిల్ విజేత సర్గమ్ కౌశల్ సంతోషం వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ సాహిత్యంలో సర్గమ్ పీజీ చదివారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో టీచర్‌గానూ ఆమె పనిచేశారు. ప్రస్తుతం కేన్సర్ బాధిత పిల్లల కోసం ఆమె సేవా సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. కౌశల్ భరత్ ఇండియన్ నేవీలో పనిచేస్తున్నారు.

1984 నుంచి మిసెస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తుండగా 2001లో భారత్‌కు చెందిన డాక్టర్ అదితీ గోవిత్రికర్ మొదటిసారి మిసెస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఇప్పుడు 21 ఏండ్ల తర్వాత మళ్లీ సర్గమ్ కౌశల్ భారత్‌ తరఫున ఈ కిరీటాన్ని దక్కించుకోవడం విశేషం.

Follow Us : FacebookTwitter

Read More Articles |

FIFA World cup 2022 | నెరవేరిన మెస్సీ కల.. ఫిఫా వరల్డ్ కప్‌ ఫైనల్‌లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా విజయం.. విశ్వవిజేతగా అర్జెంటీనా

Tips to sleep | బోర్లా పడుకుంటే ప్రమాదమా.. ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టేనా ? వైద్యులు ఏం చెబుతున్నారు?

Household tips | యాపిల్‌ను కోసినప్పుడు రంగు మారిపోతుందా?

How to wash silk sarees | పట్టుబట్టలపై మరకలు పడ్డాయా? ఈ చిట్కాలతో సులువుగా పోగొట్టుకోండి

Mosquito bites | దోమలు కొంతమందినే కుడుతాయి? ఎందుకని ఎప్పుడైనా గమనించారా?

Exit mobile version