Home News AP Taraka Ratna | అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్నభార్య అలేఖ్య రెడ్డి.. ఆస్పత్రికి తరలించిన కుటుంబసభ్యులు

Taraka Ratna | అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్నభార్య అలేఖ్య రెడ్డి.. ఆస్పత్రికి తరలించిన కుటుంబసభ్యులు

Taraka Ratna | నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో శనివారం రాత్రి నుంచి అలేఖ్య రెడ్డి శోకసంద్రంలో మునిగిపోయారు. నిన్నటి నుంచి భోజనం కూడా తీసుకోకపోవడంతో పూర్తిగా నీరసించిపోయారు. ఈ క్రమంలోనే అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

భర్త మరణించాడన్న వార్త తెలిసినప్పటి నుంచి అలేఖ్య రెడ్డి కుమిలిపోతున్నారు. బంధువులు, ఆత్మీయులు ఆమెకు దైర్యం చెబుతున్నా భర్త లేని లోటును ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు.

అలేఖ్య రెడ్డిని నందమూరి తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలను ఎదురించి 2012 ఆగస్టు 2న సంఘీ టెంపుల్‌లో ఒక్కటయ్యారు. ఉమ్మడి ఏపీ మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడితో అలేఖ్య రెడ్డికి అంతకుముందే పెళ్లైంది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం తారకరత్నను అలేఖ్య పెళ్లి చేసుకున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అండగా ఉండి వీరిద్దరి పెళ్లి చేశారు. విజయసాయి రెడ్డి మరదలి కూతురే అలేఖ్య రెడ్డి. నందమూరి తారకరత్న నటించిన నందీశ్వరుడు సినిమాకు అలేఖ్య కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేశారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Laxmi Parvathi on Taraka Ratna Death | నారా లోకేశ్‌కు చెడ్డపేరు వస్తుందనే.. తారకరత్న మరణవార్తను దాచిపెట్టారు.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

BRS MLA Sayanna | బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత..

Viral News | ఎద్దుతో యువకుడికి ఘనంగా పెళ్లి.. అనకాపల్లిలో వింత ఆచారం

Viral News | గుజరాత్‌లో నోట్ల వర్షం కురిపించిన మాజీ సర్పంచ్‌.. రూ. 500 కాగితాలను ఏరుకునేందుకు ఎగబడ్డ జనం

YS Sharmila | మహబూబాబాద్‌లో టెన్షన్‌.. టెన్షన్‌.. వైఎస్‌ షర్మిల అరెస్టు.. పాదయాత్రకు అనుమతి కూడా రద్దు

Nandamuri Tarakaratna | తారకరత్న కన్నుమూత.. 23 రోజులు ప్రాణాలతో పోరాడి ఓడిన నందమూరి వారసుడు

Exit mobile version