Home Latest News YS Sharmila | మహబూబాబాద్‌లో టెన్షన్‌.. టెన్షన్‌.. వైఎస్‌ షర్మిల అరెస్టు.. పాదయాత్రకు అనుమతి కూడా...

YS Sharmila | మహబూబాబాద్‌లో టెన్షన్‌.. టెన్షన్‌.. వైఎస్‌ షర్మిల అరెస్టు.. పాదయాత్రకు అనుమతి కూడా రద్దు

YS Sharmila | వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. మహబూబాబాద్‌లో షర్మిల పాదయాత్రకు ఇచ్చిన అనుమతిని రద్దు చేసిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని నమోదైన కేసులో భాగంగా మహబూబాబాద్‌ పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను హైదరాబాద్‌ తరలించారు.

పాదయాత్రలో భాగంగా మహబూబాబాద్‌లో పర్యటించిన వైఎస్‌ షర్మిలపై ఇటీవల ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనపై శంకర్‌ నాయక్‌ చేసిన కామెంట్ల మీద విరుచుకుపడ్డారు. కొజ్జల్లా ఉన్న కొందరు ఆంధ్రా వలసవాదులు వస్తున్నారని శంకర్‌ నాయక్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పర్యటనలు చేసుకుంటే చేసుకోండి కానీ.. మాట్లాడే భాష అదుపులో లేకుంటే.. కంకర రాళ్లకు పనిచెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాను సైగ చేస్తే చాలు.. పార్టీ కార్యకర్తలు తరిమి తరిమి కొడతారని వార్నింగ్‌ ఇచ్చారు. శంకర్‌ నాయక్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై వైఎస్‌ షర్మిల శనివారం స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కబ్జాకోర్‌ శంకర్‌ నాయక్‌ సైగ చేస్తే పాదయాత్రపై ఆయన గూండాలు దాడి చేస్తారట.. ఆయనకు సవాలు చేస్తున్నా.. దమ్ముంటే పాదయాత్రపై దాడి చేయ్‌ అని షర్మిల మండిపడ్డారు. తాటాకు చప్పుళ్లకు వైఎస్సార్‌ బిడ్డ భయపడదని స్పష్టం చేశారు. మీరు చేసిన అవినీతి అక్రమాలు, మోసాలపై బరాబర్‌ ప్రశ్నిస్తామని అన్నారు. ఎవర్రా కొజ్జాలు.. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం చేతకానీ మీరు కొజ్జాలు అని సీరియస్‌ అయ్యారు. మహిళను పట్టుకుని కొజ్జా అంటే ప్రజలే తరిమికొడతారని హెచ్చరించారు.

వైఎస్‌ షర్మిల వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బేతోలులోని షర్మిల శిబిరంపై దాడి చేశారు. వైఎస్సార్‌ టీపీ ఫ్లెక్సీలు, కటౌట్లను ధ్వంసం చేశారు. శంకర్‌ నాయక్‌పై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ధర్నాకు దిగారు. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో షర్మిలను అరెస్టు చేసి హైదరాబాద్‌ తరలించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Viral News | ఎద్దుతో యువకుడికి ఘనంగా పెళ్లి.. అనకాపల్లిలో వింత ఆచారం

Viral News | గుజరాత్‌లో నోట్ల వర్షం కురిపించిన మాజీ సర్పంచ్‌.. రూ. 500 కాగితాలను ఏరుకునేందుకు ఎగబడ్డ జనం

YS Sharmila | మహబూబాబాద్‌లో టెన్షన్‌.. టెన్షన్‌.. వైఎస్‌ షర్మిల అరెస్టు.. పాదయాత్రకు అనుమతి కూడా రద్దు

Nandamuri Tarakaratna | తారకరత్న కన్నుమూత.. 23 రోజులు ప్రాణాలతో పోరాడి ఓడిన నందమూరి వారసుడు

Passport | పాస్‌పోర్టు అప్లై చేసే వాళ్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఐదు రోజుల్లోనే వెరిఫికేషన్ కంప్లీట్

Exit mobile version