Home News AP Pawan Kalyan | ఎవడ్రా మనల్ని ఆపేది.. రణస్థలంలో గర్జించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan | ఎవడ్రా మనల్ని ఆపేది.. రణస్థలంలో గర్జించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌

Image Source: janasena facebook

Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగిన తీరు చూసి బాధ కలిగిందని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రణస్థలంలో జనసేన యువశక్తి సభకు కదిలి వచ్చిన పార్టీ శ్రేణులను చూసి పవన్‌ కళ్యాణ్ ఉప్పొంగిపోయారు. ఇక ఎవడ్రా మనల్ని ఆపేది అంటూ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. జనసేన పార్టీ పెట్టినప్పుడు తన పక్కన ఎవరూ లేరన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈరోజు ప్రతీ సన్నాసితో తిట్లు పడుతున్నా బాధ కలగట్లేదని వ్యాఖ్యానించారు. సాటి మనుషుల కోసం జీవించడం గొప్ప విషయంగా భావిస్తున్నానని అన్నారు.

చివరి శ్వాస వరకు రాజకీయాల్లోనే ఉంటానని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న నాయకులెవరూ యువత గురించి ఆలోచించట్లేదని, కన్న బిడ్డల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నాయకుల నిజస్వరూపం చూసి చిరాకు, బాధ అనిపించిందని వ్యాఖ్యానించారు. సినిమాలు చేస్తున్నా కూడా తన మనసు కష్టాల్లో ఉన్న ప్రజల గురించే ఆలోచించేదన్నారు. నా కోసం తొలి ప్రేమ, ఖుషి సినిమాల వరకే పోరాటం చేశానని, తాను సగటు మధ్య తరగతి మనిషే అంటూ వ్యాఖ్యానించారు. సినిమాల విజయం తనకు ఆనందన్నివ్వలేదని ఈ సందర్భంగా చెప్పారు. సామాన్యుల కష్టాలు నన్ను సంతోషంగా ఉండనివ్వలేదని వ్యాఖ్యానించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Hyper Aadi | పవన్‌ కళ్యాణ్‌కు తిక్క రేగితే మీరంతా కాశీ యాత్రకే.. ఏపీ మంత్రులపై హైపర్‌ ఆది సెటైర్లు

RRR Sequel | ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై రాజమౌళి కీలక అప్‌డేట్.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన వేళ నిర్ణయం మార్చుకున్న జక్కన్న

varisu vs thunivu | ఇదేం అరాచకం.. చెన్నైలో థియేటర్ ముందే తన్నుకున్న విజయ్, అజిత్ ఫ్యాన్స్

RRR Naatu Naatu | రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్.. నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు

Oscars 2023 | సైలెంట్‌గా ఆస్కార్ బరిలోకి నిలిచిన కాంతార.. సౌత్ నుంచి ఇంకా ఏ సినిమాలు నామినేషన్స్‌లో నిలిచాయి?

Exit mobile version