Home Entertainment RRR Naatu Naatu | రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్.. నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్‌ గ్లోబ్‌...

RRR Naatu Naatu | రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్.. నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు

Image Source : Twitter

RRR Naatu Naatu | రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్న ఈ చిత్రం.. సినీరంగంలో ప్రతిష్టా్త్మకంగా భావించే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుకు ఎంపికైంది. లాస్‌ ఏంజిల్స్‌లో అట్టహాసంగా ప్రారంభమైన వేడుకల్లో బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు సాంగ్‌కు ఈ అవార్డును ప్రకటించారు. ఆస్కార్‌ బరిలో నిలిచిన ఈ సాంగ్‌ ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకోవడంతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ వేడుకలకు కుటుంబ సభ్యులతో హాజరైన చిత్ర బృందం ఎస్‌ఎస్‌ రాజమౌళి, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, ఎంఎం కీరవాణి అవార్డు ప్రకటించడంతో ఒక్కసారిగా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. చప్పట్లతో హార్షాతిరేకాలు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన ప్రాతల్లో దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ పాన్‌ ఇండియా చిత్రంగా విడుదలై రికార్డులు బద్దలు కొట్టింది. మొత్తం అని భాషల్లో కలిపి రూ.1200 కోట్లకుపైగా వసూలు చేసింది. ముఖ్యంగా ఈ చిత్రంలో నాటు నాటు సాంగ్‌.. సినిమా విడుదలకు ముందు నుంచే రికార్డులు క్రియేట్ చేసింది. ఇందులోని స్టెప్స్ భారతీయులనే కాదు విదేశీయులను సైతం ఆకట్టుకుంది. కీరవాణి స్వరపరిచిన ఈ సాంగ్‌ను రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలబైరవ పాడారు. చంద్రబోస్‌ సాహిత్యం అందించగా, ప్రేమ్‌ రక్షిత్‌ కొరియోగ్రాఫర్‌గా ఉన్నాడు.

విమర్శకుల ప్రశంసలు పొందిన ఆర్ఆర్ఆర్ చిత్రం భారత్ నుంచి ప్రతిష్ట్మాత్మక ఆస్కార్‌ బరిలో నిలుస్తుందని భావించినప్పటికీ ఎంపిక కాలేదు. అయినప్పటికీ జనరల్‌ కేటగిరీలో ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం పలు విభాగాల్లో ప్రయత్నం చేసింది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో నాటు నాటు సాంగ్‌ షార్ట్‌ లిస్ట్‌కు ఎంపికైంది. ఈ నెల 12 నుంచి 17 వరకు ఓటింగ్‌ నిర్వహించి జనవరి 24న ఫైనల్ నామినేషన్స్‌ను ప్రకటిస్తారు. అస్కార్‌ ఫైనల్‌ లిస్ట్‌ ముందు ఈ అవార్డు వరించడంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందం సంతోషంలో మునిగింది.

ఈ అవార్డు రాజమౌళి, ప్రేమ్‌ రక్షిత్‌కు చెందుతుంది: కీరవాణి

గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకోవడం పట్ల మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి సంతోషం వ్యకం చేశారు. అవార్డు తీసుకున్న అనంతరం కీరవాణి వేదికపై మాట్లాడారు. ‘ఇలాంటి గొప్ప సందర్భం చోటుచేసుకోవడం చాలా సంతోషం. ఈ గొప్ప క్షణాలను ఇక్కడే ఉన్న నా భార్యతో కలిసి పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎంతో కృషి చేస్తేనే ఈ అవార్డు వచ్చింది. ప్రియారిటీ ప్రకారంగా చూస్తే మొదటగా నా సోదరుడు రాజమౌళికే ఈ అవార్డు దక్కుతుంది. అతని విజన్‌తో నామీద నమ్మకం ఉంచి నాకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆ తర్వాత ఈ ‘నాటు నాటు’ సాంగ్‌కు నృత్యరీతులు సమకూర్చిన ప్రేమ్‌ రక్షిత్‌కు ఈ అవార్డు చెందుతుంది. అతను లేకుంటే ఈ అవార్డు వచ్చేది కాదు. ఈ పాట కోసం కాలబైరవ ఎన్నో అద్భుతమైన ఏర్పాట్లు చేశాడు. రచయితగా చంద్రబోస్‌ అద్భుతమైన పదాలను అల్లాడు. రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ తమ ఎనర్జీతో ఈ పాటకు ఊపుతెచ్చారు. ఎన్టీరామారావు, రామ్‌చరణ్‌ అద్భుతరీతిలో డ్యాన్స్‌ చేశారు. ఈ పాటకు సహకరించిన సాలు సిద్ధార్థ్‌, జీవన్‌ బాబుకు ధన్యవాదాలు. థాంక్యూ శ్రీవల్లీ’’ అంటూ కీరవాణి ముగించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Nabha Natesh | నభా నటేశ్‌కు యాక్సిడెంట్‌.. పలు సర్జరీలతో కోలుకున్న ఇస్మార్ట్‌ బ్యూటీ

Oscars 2023 | సైలెంట్‌గా ఆస్కార్ బరిలోకి నిలిచిన కాంతార.. సౌత్ నుంచి ఇంకా ఏ సినిమాలు నామినేషన్స్‌లో నిలిచాయి?

KGF Chapter3 | కేజీఎఫ్ సీక్వెల్స్‌లో రాఖీ భాయ్ ఉండడు.. బాంబు పేల్చిన హోంబలే బ్యానర్స్

Vaarasudu | వెనక్కి తగ్గిన దిల్ రాజు.. వారసుడు సినిమా రిలీజ్ వాయిదా

Chiranjeevi vs Balakrishna | సంక్రాంతి పండుగకి పదో సారి పోటీపడ్డ చిరంజీవి, బాలయ్య.. ఎక్కువసార్లు గెలిచింది ఎవరు?

Sreemukhi | మరీ ఇంత ఘోరమా.. పెళ్లి వార్తలపై స్పందించిన బుల్లితెర యాంకర్ శ్రీముఖి

Exit mobile version