Home Entertainment RRR Sequel | ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై రాజమౌళి కీలక అప్‌డేట్.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన...

RRR Sequel | ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై రాజమౌళి కీలక అప్‌డేట్.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన వేళ నిర్ణయం మార్చుకున్న జక్కన్న

Image Source : Twitter

RRR Sequel | ఆర్‌ఆర్ఆర్ సినిమాతో జక్కన్న జైత్రయాత్ర కొనసాగుతోంది. బాహుబలి సినిమాతో దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న రాజమౌళి.. ఆర్‌ఆర్‌ఆర్‌తో యావత్ ప్రపంచాన్ని ఆకర్షించాడు. ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన భారతీయులే కదా.. విదేశీయులు కూడా సలామ్ చేస్తున్నారు. అంతర్జాతీయ అవార్డులతో సత్కరిస్తున్నారు. తాజాగా ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడంతో ఎక్కడ చూసినా దీని గురించే టాపిక్ నడుస్తోంది. గ్లోబ్స్ గెలుచుకుందంటే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కూడా గెలిచేస్తోంది అంతా ఫిక్సపోయారు. ఇంతలా ఆర్ఆర్ఆర్ సినిమాకు వస్తున్న క్రేజ్ చూశాక.. తనకు సీక్వెల్ చేయాలనే ఆలోచన వచ్చిందని సంచలన ప్రకటన చేశాడు దర్శకధీరుడు రాజమౌళి.

బాహుబలి తరహాలో ఆర్ఆర్ఆర్ సినిమాకు సీక్వెల్ ఉంటుందా అని తెలుగు ప్రేక్షకులు ఎప్పట్నుంచో అడుగుతున్నారు. కానీ జక్కన్న మాత్రం ముందు నుంచి నో అనే చెప్పుకొచ్చాడు. ఒక పార్ట్‌తోనే స్టోరీ కంప్లీట్ చేస్తామని.. దీనికి సీక్వెల్ చేసే ఆలోచన లేదని అప్పట్లో చెప్పాడు. ఇది ఆర్ఆర్ఆర్ రిలీజ్‌కు ముందుమాట. విడుదలైన తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాకు ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. భారత్‌తో పాటు విదేశాల్లోనూ ఈ సినిమాకు మంచి బజ్ వచ్చింది. ఈ సినిమా తీసిన తీరును విదేశీయులు సైతం మెచ్చుకుంటున్నారు. ఇదంతా చూసిన తర్వాత రాజమౌళికి సీక్వెల్ తీయాలనే ఆలోచన వచ్చిందట. నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజమౌళి.. ఈ విషయాన్ని బయటపెట్టాడు.

ఆర్ఆర్ఆర్ సినిమా సీక్వెల్‌పై ముందు నుంచే కొన్ని ఐడియాలు వచ్చాయని రాజమౌళి తెలిపాడు. బలవంతంగా సీక్వెల్స్ తీయకూడదని అనుకుని దాన్ని విరమించుకున్నామని చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసిన తర్వాత ఆర్ఆర్ఆర్ యూనిట్, తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో సీక్వెల్‌పై డిస్కస్ చేశానని చెప్పాడు. అప్పుడే సీక్వెల్ మీద అద్భుతమైన ఆలోచన తట్టిందని పేర్కొన్నాడు. ఈ ఆలోచన ఆధారంగా స్టోరీ రాయడం మొదలుపెట్టామని చెప్పాడు. స్క్రిప్టు రాయడం పూర్తయ్యేదాకా దీనిపై ముందుకెళ్లలేమని స్పష్టం చేశాడు. ప్రస్తుతం మేమంతా అదే పనిపై ఉన్నామని వెల్లడించాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

RRR Naatu Naatu | రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్.. నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు

Oscars 2023 | సైలెంట్‌గా ఆస్కార్ బరిలోకి నిలిచిన కాంతార.. సౌత్ నుంచి ఇంకా ఏ సినిమాలు నామినేషన్స్‌లో నిలిచాయి?

Nabha Natesh | నభా నటేశ్‌కు యాక్సిడెంట్‌.. పలు సర్జరీలతో కోలుకున్న ఇస్మార్ట్‌ బ్యూటీ

Exit mobile version