Home News AP Hyper Aadi | పవన్‌ కళ్యాణ్‌కు తిక్క రేగితే మీరంతా కాశీ యాత్రకే.. ఏపీ మంత్రులపై...

Hyper Aadi | పవన్‌ కళ్యాణ్‌కు తిక్క రేగితే మీరంతా కాశీ యాత్రకే.. ఏపీ మంత్రులపై హైపర్‌ ఆది సెటైర్లు

Image Source: janasena facebook

Hyper Aadi | టైం2న్యూస్‌: ఏపీ రాజకీయాల్లో ప్రతి ఒక్కడూ పాపులారిటీ కోసం పవన్ కల్యాణ్‌ ను విమర్శిస్తారు అంటూ యాక్టర్ హైపర్‌ ఆది సంచలన వ్యాఖ్యలు చేశాడు. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో నిర్వహించిన జనసేన యువశక్తి సభలో మాట్లాడిన హైపర్‌ ఆది.. ఏపీ మంత్రులపై సెటైర్లు వేశారు. ఏపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్‌ను తిట్టే శాఖ కూడా పెట్టుకోవాలని ఎద్దేవా చేశాడు. 150 మంది ఎమ్మెల్యేలు ఒక్కడి ముందు భయపడుతున్నారని ఎద్దేవా చేశాడు. ఆ శాఖ పెట్టుకుని అదే పనిగా తిట్టుకోండి.. శాఖల పరువు తీస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. మీ శాఖల గురించి పది నిమిషాలు చెప్పమంటే పదో సెకనులోనే దొరికిపోతారు అంటూ ధ్వజమెత్తాడు.

సీఎంగా ప్రమాణం చేస్తున్నా అనే మాట పవన్ నోట వినాలి

Pavan Kalyan
Image Source: janasena facebook

” సినిమా వాడిగా మాట్లాడటానికి నేను ఈరోజు ఇక్కడికి రాలేదు. జనసేన సిద్ధాంతాలు నచ్చి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన ఏ ఒక్కరూ కూడా బీరు బాటిల్, బిర్యానీ పొట్లం కోసం రాలేదు. వారి భవిష్యత్తు మీద భయం కలిగింది కాబట్టే ఇక్కడ ఉన్న పవన్ మీద నమ్మకంతో వచ్చారు. ఆ నమ్మకాన్ని ఆయన ఎన్నటికీ వమ్ము చేయరు” అని హైపర్‌ ఆది అన్నాడు. గురువారం శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన యువశక్తి సభకు హైపర్‌ ఆది హాజరయ్యాడు. ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ.. ” ప్రతీ ఒక్కరికీ ఒక గోల్ ఉంటుంది. నాకు ఓ గోల్ ఉంది. అదేంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోట ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అనే మాట వినాలని ఉంది” అని అన్నాడు. ఏపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ను తిట్టే శాఖ కూడా పెట్టుకోవాలని ఎద్దేవా చేశాడు.

పవన్‌ కళ్యాణ్‌కు తిక్కరేగితే..

150 మంది ఎమ్మెల్యేలు ఒక్కడి ముందు భయపడుతున్నారని దుయ్యబట్టాడు. ఆ శాఖ పెట్టుకుని అదే పనిగా తిట్టుకోండి.. శాఖల పరువు తీస్తున్నారు.

మీ శాఖల గురించి పది నిమిషాలు చెప్పమంటే మీరు పదో సెకనులోనే దొరికిపోతారు అంటూ విమర్శించాడు. పవన్ కళ్యాణ్ కొంత కాలం కష్టపడితే ఎలాంటి పదవైనా వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ అనే పదవి మాత్రం ఎవరికీ రాదన్నాడు. వారాహి బండిని అడ్డుకుంటారా? ఆయనకు తిక్కరేగితే పాదయాత్ర చేస్తారు. అప్పుడు మీరు కాశీయాత్రకు పోవాల్సిందేనని పంచ్‌లు వేశారు.

జనసేనాని అందుకే అయ్యాడు..

పవన్ కళ్యాణ్ జనాల పక్షాన ఉన్నాడు కాబట్టే జనసేనాని అయ్యాడన్నారు. ఈ మధ్య ప్యాకేజీ అంటున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రేమకు లొంగుతాడే తప్ప.. ప్యాకేజీకి కాదన్నారు.

పవన్ రెండు చోట్ల ఓడిపోయారని ఎప్పుడూ విమర్శలు చేస్తూ ఉంటారు. రెండు చోట్ల ఓడిపోతేనే ఇంతమంది ప్రజలకు సహాయం చేస్తున్నారంటే.. గెలిస్తే మీ కష్టాన్ని కంపోడ్ వాల్ కూడా దాటనివ్వడని పంచ్ లు వేశారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ ను విమర్శించి.. పాపులర్ అయిపోవాలనుకునేవాడే! మీ పాపులారిటీ కోసం ఆయన పర్సనాలిటీ దెబ్బతినేలా మాట్లాడితే ఈసారి జనసేన కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తొస్తాడు అంటూ వ్యాఖ్యానించాడు.

నన్ను కన్న నా తల్లిపై ఒట్టేసి చెబుతున్నా..

నిలకడలేని రాజకీయం అంటున్నారు.. మీరేమో వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాలు చేయొచ్చా? కానీ ఆయన మాత్రం సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా? అని ప్రశ్నించారు. ఒక్కడి నిజాయతీని తట్టుకోలేక 151 మంది భయపడిపోతున్నారు.. అదేనా మీ రాజకీయం? పవన్ పై కుల ముద్ర వేస్తున్నారు.. నన్ను కన్న నా తల్లిపై ఒట్టేసి చెబుతున్నా.. పవన్ లాంటి నీతిమంతుడైన రాజకీయ నాయకుడిని మరొకరిని చూడలేరు అంటూ చెప్పుకొచ్చాడు హైపర్ ఆది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

RRR Sequel | ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై రాజమౌళి కీలక అప్‌డేట్.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన వేళ నిర్ణయం మార్చుకున్న జక్కన్న

varisu vs thunivu | ఇదేం అరాచకం.. చెన్నైలో థియేటర్ ముందే తన్నుకున్న విజయ్, అజిత్ ఫ్యాన్స్

RRR Naatu Naatu | రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్.. నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు

Oscars 2023 | సైలెంట్‌గా ఆస్కార్ బరిలోకి నిలిచిన కాంతార.. సౌత్ నుంచి ఇంకా ఏ సినిమాలు నామినేషన్స్‌లో నిలిచాయి?

Exit mobile version