Home Latest News Jagga reddy | కేసీఆర్‌ ఏపీలో ప్రభావం చూపించలేరు కానీ తెలంగాణలో చంద్రబాబు చూపిస్తారు.. జగ్గారెడ్డి...

Jagga reddy | కేసీఆర్‌ ఏపీలో ప్రభావం చూపించలేరు కానీ తెలంగాణలో చంద్రబాబు చూపిస్తారు.. జగ్గారెడ్డి సెన్సేషనల్‌ కామెంట్స్‌

Jagga reddy | తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రభావం చూపించలేరని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. అదే చంద్రబాబు తెలంగాణలో ప్రభావం చూపిస్తారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చి కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్నారని, అందువల్లే టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

పార్టీ పేరు మార్చి తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ అవమానించారని జగ్గారెడ్డి మండిపడ్డారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సైలెంట్‌గా ఉన్న చంద్రబాబును రాష్ట్రానికి వచ్చేలా చేసింది కేసీఆరే అని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీలోంచి తెలంగాణను తీసేసి తెలంగాణ వాదాన్ని కేసీఆర్ చంపేశారని జగ్గారెడ్డి ఆరోపించారు. అంతేకాదు.. అలా చేసి కేసీఆర్ తన బలాన్ని కూడా కోల్పోయారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇక కేసిఆర్‌తో ఆడుకుంటారని అన్నారు. కూటములు, పొత్తులపై ముందు ముందు తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇక సీరియస్ పాలిటిక్స్ నడుస్తాయని జోస్యం చెప్పారు.

కేసీఆర్‌ మనసులో సమైక్య భావన!

ఏపీ రాజకీయాల్లో కేసీఆర్‌ ప్రభావం చూపించలేరన్న జగ్గారెడ్డి.. తెలంగాణలో మాత్రం చంద్రబాబు ప్రభావం చూపించగలుగుతారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మనసులో ఎక్కడో ఇంకా సమైక్య భావన ఉంది కాబట్టే రాజకీయ జీవితాన్నిచ్చిన చెట్టునే నరికేశారంటూ ఆరోపణలు గుప్పించారు. బీఆర్‌ఎస్‌తో కేసీఆర్‌ విజయం సాధించే పరిస్థితి లేదన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకకు బీఆర్‌ఎస్‌ వెళ్తే టీడీపీ కూడా వస్తుందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

CESS Elections | సెస్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ విజయం.. ప్రజాస్వామ్యాన్ని బీఆర్‌ఎస్‌ అపహాస్యం చేస్తోందన్న బండి సంజయ్‌

AP Intermediate exam schedule | ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ షెడ్యూల్‌ విడుదల.. మార్చి 15 నుంచి పరీక్షలు

Srisailam | శ్రీశైలంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్రపతి ద్రౌపదిముర్ము.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Bruce Lee Death Mystery | బ్రూస్‌లీ మరణానికి అసలు కారణమేంటి? అతిగా నీళ్లు తాగడం వల్లే చనిపోయాడా?

Exit mobile version