Thursday, March 28, 2024
- Advertisment -
HomeLatest NewsRavindra Jadeja | జడేజా ఖాతాలో అరుదైన ఘనత.. దిగ్గజ ఆల్‌రౌండర్ల సరసన చేరిన జడ్డూ..

Ravindra Jadeja | జడేజా ఖాతాలో అరుదైన ఘనత.. దిగ్గజ ఆల్‌రౌండర్ల సరసన చేరిన జడ్డూ..

Ravindra Jadeja | టైమ్‌ 2 న్యూస్‌, ఇండోర్‌: భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మరో ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా.. అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో జట్టులో కీలక సభ్యుడిగా మారిన జడ్డూ.. దిగ్గజ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ సరసన చేరాడు. భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ అన్ని ఫార్మాట్లలో కలిపి 500 వికెట్లు, 5 వేల పరుగులు చేసిన రెండో ఆల్‌రౌండర్‌గా జడ్డూ చరిత్రకెక్కాడు. బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌ లో భాగంగా ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో జడ్డూ ఈ ఘనత సాధించాడు. ఆసీస్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ను ఔట్‌ చేయడం ద్వారా జడేజా.. ఓవరాల్‌గా 500 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో 171 మ్యాచ్‌లాడి 189 వికెట్లు పడగొట్టిన జడేజా.. 64 టీ20ల్లో 51 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో ఇప్పటి వరకు 263 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. దీంతో మొత్తం కలిపి 503 వికెట్లతో నిలిచాడు. ఇక బ్యాటింగ్‌ విషయానికి వస్తే.. టెస్టుల్లో 2619 పరుగులు చేసిన జడ్డూ.. వన్డేల్లో 2447, టీ20ల్లో 457 రన్స్‌ పూర్తి చేసుకున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి జడేజా 5527 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ జాబితాలో.. 1983లో భారత దేశానికి తొలి వన్డే ప్రపంచకప్‌ అందించిన దిగ్గజ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ ముందున్నాడు. టెస్టు, వన్డేల్లో కలిపి కపిల్‌ దేవ్‌ 687 వికెట్లు, 9031 పరుగులు సాధించి టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు.

ఈ జాబితాలో కపిల్‌దేవ్‌, జడేజా కాకుండా.. దక్షిణాఫ్రికా స్టార్‌ ఆల్‌రౌండర్లు జాక్వస్‌ కలీస్‌ (577 వికెట్లు, 25,534 పరుగులు), షాన్‌ పోలాక్‌ (829 వికెట్లు, 7386 పరుగులు), పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్లు ఇమ్రాన్‌ ఖాన్‌ (544 వికెట్లు, 7 516 పరుగులు), వసీం అక్రమ్‌ (916 వికెట్లు, 6615 పరుగులు), షాహిద్‌ అఫ్రిది (541 వికెట్లు, 11,196 పరుగులు) కూడా ఉన్నారు. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సర్‌ ఇయాన్‌ బోథమ్‌ (528 వికెట్లు, 7313 పరుగులు), లంక పేసర్‌ చమింద వాస్‌ (755 వికెట్లు, 5114 పరుగులు), న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ డానియల్‌ వెటోరీ (667 వికెట్లు, 6989 పరుగులు), బంగ్లా స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ (653 వికెట్లు, 13,445 పరుగులు) కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

కోహ్లీతో సమంగా ఉమేశ్‌ యాదవ్‌..

మరోవైపు ఈ టెస్టులో భారత పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ అరుదైన ఫీట్‌ నమోదు చేసుకున్నాడు. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి కునేమన్‌ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు బాదిన ఉమేశ్‌ యాదవ్‌.. టెస్టు క్రికెట్‌లో 24 సిక్సర్లు తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో కోహ్లీ కూడా 24 సిక్సర్లే కొట్టాడు. ఈ క్రమంలో భారత మాజీ కోచ్‌ రవిశాస్త్రి (22)ని ఉమేశ్‌ యాదవ్‌ దాటేశాడు. భారత్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వారి జాబితాలో విధ్వంసక వీరుడు వీరేంద్ర సెహ్వాగ్‌ (91) ముందున్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News