Saturday, April 20, 2024
- Advertisment -
HomeLatest NewsHanuma Vihari | మణికట్టు విరిగినా.. వెరవకుండా విహారి బ్యాటింగ్‌.. రంజీలో అద్భుతం

Hanuma Vihari | మణికట్టు విరిగినా.. వెరవకుండా విహారి బ్యాటింగ్‌.. రంజీలో అద్భుతం

Hanuma Vihari | టైమ్‌ 2 న్యూస్‌, ఇండోర్‌: టీమిండియా ఆటగాడు హనుమ విహారి రంజీ ట్రోఫీలో వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విహారి.. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న క్వార్టర్‌ ఫైనల్లో మణికట్టు విరిగినా.. వెరవకుండా ఒంటిచేత్తో బ్యాటింగ్‌ కొనసాగించి ఆట పట్ల తనకున్న నిబద్దతను చాటుకున్నాడు.

కెరీర్‌ ఆరంభం నుంచి అంకితభావానికి పర్యాయపదంలా నిలుస్తూ వచ్చిన ఈ తెలుగబ్బాయి.. ఇండోర్‌లో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో మరోసారి ఆకట్టుకున్నాడు. తొలి రోజు బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో అవేశ్‌ ఖాన్‌ వేసిన బంతికి విహారి మణికట్టు ప్రాక్చర్‌ అయింది. దీంతో అతడు రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో రికీ భుయ్‌, కరణ్‌ శిండేలు శతకాలు సాధించడంతో ఆంధ్ర జట్టు మంచి స్కోరు చేయగలిగింది. అయితే వీరిద్దరూ రెండో రోజు వెంటవెంటనే ఔట్‌ కాగా.. 30 పరుగుల వ్యవధిలో ఆంధ్ర జట్టు 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన విహారి.. ఒంటిచేత్తోనే బ్యాటింగ్‌ చేస్తూ.. సహచరులతో పాటు ప్రత్యర్థులను సంబ్రమాశ్చర్యాలకు గురిచేశాడు. 26 పరుగులు చేసి ఆఖరి వికెట్‌ రూపంలో వెనుదిరిగాడు. ఈ క్రమంలో తనను గాయపరిచిన అవేశ్‌ ఖాన్‌ సూపర్‌ ఫాస్ట్‌ బంతులను విహారి సమర్థవంతంగా ఎదుర్కోవడం కొసమెరుపు. విహారి నిబద్దతకు సామాజిక మాధ్యమాల్లో అభిమానులు సలాం చేస్తున్నారు. విహారి పోరాటంతో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులకు ఆలౌట్‌ కాగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 144/4తో నిలిచింది.

ఆస్ట్రేలియాలోనూ ఇదే తీరు..

మిడిలార్డర్‌ బ్యాటర్‌గా కెరీర్‌ ప్రారంభించిన విహారి.. జట్టుకు అవసరమైతే ఎక్కడ బ్యాటింగ్‌ చేసేందుకైనా సిద్ధమేనని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఆసీస్‌ వంటి ప్రమాదకర పిచ్‌లపై బంతిని పాతబడేలా చేసేందుకు విహారివంటి క్లాస్‌ ప్లేయర్‌ అవసరముందని మేనేజ్‌మెంట్‌ నిర్ణయిస్తే.. తనకు అసలు అలవాటే లేని ఓపెనింగ్‌ స్థానంలో బ్యాటింగ్‌ చేశాడు. ఇక 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో విహారి తెగువ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పటికే స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ వ్యక్తిగత పనిమీద భారత్‌కు తిరుగు పయనం కాగా.. సిడ్నీ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో విహారి విశ్వరూపం కనబర్చాడు.

అప్పటికే భారత్‌, ఆసీస్‌ ఒక్కో మ్యాచ్‌ నెగ్గి 1-1తో సమ ఉజ్జీలుగా ఉన్న సమయంలో మూడో మ్యాచ్‌లో కంగారూలు భారీ స్కోరు చేశారు. స్టీవ్‌ స్మిత్‌ శతక్కొట్టడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులు చేసింది. బదులుగా టీమిండియా 244 పరుగులకే ఆలౌటైంది. ఇంకేముంది కంగారూ గడ్డపై మరో పరాజయం తప్పదనిపించింది.

రెండో ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడిన ఆసీస్‌ 312/6 వద్ద డిక్లేర్‌ చేసి టీమిండియా ముందు 407 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. నాలుగో ఇన్నింగ్స్‌లో సిడ్ని పిచ్‌పై నాలుగొందల పైచిలుకు లక్ష్యఛేదన అసాధ్యం కాగా.. మనవాళ్లు ఆరంభం నుంచి చక్కటి పోరాటం చేశారు. రోహిత్‌ శర్మ (52), శుభ్‌మన్‌ గిల్‌ (31) మెరుగైన ఆరంభాన్నిస్తే.. మిస్టర్‌ డిపెండబుల్‌ చతేశ్వర్‌ పుజారా (77) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌ రహానే (4) నిరాశ పరిచినా.. వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ (97) సుడిగాలి ఇన్నింగ్స్‌తో ఆశలు రేపినా చివరి వరకు నిలువలేకపోయాడు.

ఈ దశలో క్రీజులో అడుగుపెట్టిన హనుమ విహారి మొక్కవోని సంకల్పంతో మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించాడు. మిషెల్‌ స్టార్క్‌, జోష్‌ హజిల్‌వుడ్‌, పాట్‌ కమిన్స్‌, కామెరూన్‌ గ్రీన్‌ బాడీ లైన్‌ బౌలింగ్‌తో ఇబ్బంది పెడుతున్నా ఏమాత్రం వెరవకుండా ఓవర్లకు ఓవర్లు కరిగిస్తూ మ్యాచ్‌ను ‘డ్రా’ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో 161 బంతులు ఎదుర్కొన్న విహారి 23 పరుగులతో అజేయంగా మైదానాన్ని వీడాడు. అతడికి సహకరించిన అశ్విన్‌ (128 బంతుల్లో 39 నాటౌట్‌) నాణ్యమైన ఇన్నింగ్స్‌ ఆడటంతో ఆ మ్యాచ్‌లో భారత్‌ గట్టెక్కింది.

ఆ తర్వాత గబ్బాలో జరిగిన చివరి మ్యాచ్‌ను గెలుచుకున్న భారత్‌ 2-1తో చారిత్రక బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌ను వరుసగా రెండోసారి ఒడిసి పట్టి చరిత్ర లిఖించిన విషయం తెలిసిందే. ఆ రోజు బౌన్సర్లను తట్టుకుంటూ వీరోచితం పోరాటం చేసిన విహారి ఇప్పుడు రంజీ ట్రోఫీలో విరిగిన చేతితో బ్యాటింగ్‌ చేసి తన నిబద్దత చాటుకున్నాడు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Rishab Pant | రిషబ్‌ పంత్‌ సర్జరీ సక్సెస్‌.. తొందరలోనే డిశ్చార్జి.. కానీ అదొక్కటే సమస్య

Novak Djokovic | జొకో జైత్రయాత్ర.. 22వ గ్రాండ్‌స్లామ్‌తో అగ్రస్థానానికి చేరిన సెర్బియా వీరుడు

India Vs New Zealand | ఉత్కంఠ పోరులో రెండో టీ20లో కివీస్‌పై భారత్ విజయం.. సిరీస్‌పై ఆశలు

India Vs New Zealand | రెండో టీ20లో చేతులెత్తేసిన న్యూజిలాండ్.. భారత్ విజయ లక్ష్యం 100 పరుగులే

Australian Open | సంచలనం సృష్టించిన నొవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డును సమం చేసిన సెర్బియా దిగ్గజం

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News