Friday, March 31, 2023
- Advertisment -
HomeNewsInternationalIndia Vs New Zealand | ఉత్కంఠ పోరులో రెండో టీ20లో కివీస్‌పై భారత్ విజయం.....

India Vs New Zealand | ఉత్కంఠ పోరులో రెండో టీ20లో కివీస్‌పై భారత్ విజయం.. సిరీస్‌పై ఆశలు

India Vs New Zealand | ఉత్కంఠ పోరులో రెండో టీ20లో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించింది. తొలి టీ20లో కంగుతున్న టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించడంతో రెండో టీ20లో విజయం సాధించి సిరీస్‌పై ఆశలు నిలుపుకుంది. కివీస్ నిర్ధేశించిన 100 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించేందుకు భారత బ్యాటర్లు చివరి వరకు కష్టపడ్డారు. చివరికి భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

100 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి ఆచితూచి ఆడారు. అయితే 46 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ రనౌట్ అయ్యాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. కానీ వెనువెంటనే రాహుల్ త్రిపాఠి 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ కూడా రనౌట్ కావడంతో భారత బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా సహకారంతో సూర్య కుమార్ యాదవ్ భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.

తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు విజృంభించడంతో న్యూజిలాండ్ చేతులెత్తేసింది. కీలకమైన రెండో టీ20లో నిర్ణీత 20 ఓవర్లకు కివీస్ 99 పరుగులు మాత్రమే చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ కెప్టెన్ మిచెల్ శాంటర్న్ 19 పరుగులే ఆ జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఫిన్ అలెన్ 11, డేవన్ కాన్వే 11, మార్క్ చాప్‌మన్ 14, మైకెల్ బ్రాస్‌వెల్ 14 పరుగులు చేశారు.

భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు, హర్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, దీపక్ హుడా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Odisha Health Minister | ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఆరోగ్య శాఖ మంత్రి మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒడిశా సీఎం

Hindenburg Research | కుబేరుల జాబితానే తలకిందులు చేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌.. గౌతమ్ అదానీ షేర్ల పతనం వెనుక ఆయనే !

Australian Open | సంచలనం సృష్టించిన నొవాక్ జకోవిచ్.. నాదల్ రికార్డును సమం చేసిన సెర్బియా దిగ్గజం

mobiles on plane | విమానం ఎక్కగానే మొబైల్‌ స్విచ్చాఫ్‌ చేయమని ఎందుకు చెబుతారు?

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

Legal Advice | భర్త కనిపించకుండా పోతే భార్యకు ఆస్తి దక్కుతుందా? దీనికి ఏం చేయాలి?

Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News