Home Latest News Delhi Mayor Elections | సుప్రీంకోర్టుకు చేరిన దిల్లీ మేయర్ ఎన్నిక పంచాయితీ.. ఇవాళే విచారణ...

Delhi Mayor Elections | సుప్రీంకోర్టుకు చేరిన దిల్లీ మేయర్ ఎన్నిక పంచాయితీ.. ఇవాళే విచారణ !

Delhi Mayor Elections | ఎప్పటికప్పుడూ వాయిదా పడుతూ వస్తున్న ఢిల్లీ మేయర్‌ ఎన్నికలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ మేయర్‌ అభ్యర్థి డాక్టర్ షెల్లీ ఒబెరాయ్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నిర్ణీత గడువులోగా ఎన్నికలు జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపే అవకాశం ఉంది.

దిల్లీ మున్సిపల్ ఎన్నికలు గత ఏడాది డిసెంబర్‌లో జరిగాయి. ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. మొత్తం 250 వార్డులకు గానూ ఆప్ 134, బీజేపీ 104 వార్డుల్లో గెలుపొందింది. కాంగ్రెస్‌ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఆప్‌కే వస్తాయని అంతా అనుకున్నారు. షెల్లీ ఒబెరాయ్ మేయర్‌గా ఎన్నికవుతారని అనుకున్నారు. కానీన ఇప్పటివరకు మేయర్ ఎన్నిక జరగలేదు. ఈ నెల 9వ తేదీన మేయర్ ఎన్నిక జరగాల్సి ఉండగా కార్పొరేటర్ల రసాభాసతో వాయిదా పడింది. తిరిగిన 24వ తేదీన ఎన్నిక నిర్వహించాలని భావించినప్పటికీ మళ్లీ రసాభాస జరగడంతో ఎన్నికను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో షెల్లీ ఒబెరాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అయితే మేయర్ ఎన్నిక జరగకపోవడానికి కారణం ఆమ్ ఆద్మీ పార్టీనే అంటూ దిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్‌ శంకర్‌ కపూర్‌ ఆరోపించారు. మేయర్ ఎన్నికలను ఆపుతున్నది వాళ్లేనని.. కావాలనే సభలో రభస చేసి ఎన్నికలు జరగకుండా చేస్తున్నది వాళ్లేనని.. మళ్లీ ఇప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించింది వారే అంటూ ఎద్దేవా చేశారు. కోర్టు నుంచి ఆదేశాలు ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలియదని చెప్పారు. హౌస్‌ రెండు సార్లు వాయిదా పడడానికి ఆప్‌ నేతలే కారణమని అన్నారు. అసలు ఢిల్లీకి మేయర్‌ ఉండటం ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఇష్టం లేదని, మేయర్‌ కు తనకంటే పేరు వచ్చేస్తుందని ఆయన భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Spouse Category | దిగివచ్చిన ప్రభుత్వం… తెలంగాణలో టీచర్ల స్పౌజ్‌ బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌

Revanth Reddy | ఈటలకు బీజేపీలో సంతృప్తి లేదు.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan | విడగొడతాం అంటే తోలు తీస్తా.. జాగ్రత్తగా మాట్లాడండి.. పవన్‌ కళ్యాణ్‌ వార్నింగ్‌

Balakrishna | అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ.. వివాదం సద్దుమణిగినట్టేనా?

TSPSC Syllabus | గ్రూప్ 3 సిలబస్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ

Exit mobile version