Home Latest News Revanth Reddy | ఈటలకు బీజేపీలో సంతృప్తి లేదు.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి కీలక...

Revanth Reddy | ఈటలకు బీజేపీలో సంతృప్తి లేదు.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Revanth Reddy | బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సిద్ధాంతాలను ఆయన విశ్వసించరని.. కేవలం కేసీఆర్‌ను మాత్రమే వ్యతిరేకిస్తారని పేర్కొన్నారు. ఇప్పుడు పరిస్థితి ముందుకు వెళ్లలేక.. వెనక్కి రాలేని పరిస్థితుల్లో ఈటల ఉన్నారని ఆరోపించారు. ఈటల ఒక్కడే కాదని బీజేపీలో చాలామంది అసంతృప్తులు ఉన్నారని రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అసలు ఈటల రాజేందర్ ఏ లక్ష్యం కోసమైతే బీజేపీకి వెళ్లారో ఆయనకి ఆ లక్ష్యం అక్కడ నెరవేరడం లేదని ఆయన మాట్లాడే మాటల్లోనే స్పష్టమైందని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ని ముఖ్యమంత్రి పీఠం నుంచి కిందకి దించాలన్న లక్ష్యంతో ఈటల బీజేపీలో చేరారు. కానీ అక్కడకి వెళ్లాక ఆయనకి అర్థమైన విషయం ఏంటంటే కేసీఆర్ కోవర్టులు బీజేపీలో కూడా ఉన్నారని తెలుసుకున్నారు. అందుకే ఈటల తన లక్ష్య సాధన కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కోవాల్సిందే. ఒక్క ఈటల మాత్రమే కాదు. ఆ పార్టీలోకి మారిన అనేక మంది ఇప్పుడు ఆ పార్టీలో సంతృప్తిగా లేరు. బీజేపీ కేసీఆర్ ఒక్కటే అనే విషయం ఈటల మాటల బట్టి తేటతెల్లమవుతోందని రేవంత్‌ రెడ్డి అన్నారు. దీని గురించి ప్రజలే ఆలోచించాలని సూచించారు.

కేసీఆర్ కి అంబేడ్కర్ మీద మొదటి నుంచి కక్షే.. ఆయన బర్త్డే రోజు కాకుండా… తన పుట్టిన రోజు నాడు సచివాలయం ప్రారంభించుకుంటున్నారు. ఈటల, వివేక్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి వారు బీజేపీ సిద్ధాంతాలను విశ్వసించరు. కేవలం కేసీఆర్ ను మాత్రమే వ్యతిరేకిస్తారు. బీజేపీ సిద్దాంతాలతో ఆ ముగ్గురికి సంబంధం లేదు. బీజేపీలో కూడా కోవర్టులు ఉన్నారని ఈటల అన్నారంటే.. ఏదో అసంతృప్తితో ఉన్నట్లే కాదా? ఈటల పరిస్థితి ముందుకు రాలేక, వెనక్కి పోలేని స్థితిలో ఉన్నారని రేవంత్ పేర్కొన్నారు.

ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కనీస వయసు తగ్గిస్తాం

కేంద్రంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీ ఫిరాంయిపుల చట్టాన్ని మరింత కఠినతరం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయడానికి 25 నుంచి 21 సంవత్సరాలకు తగ్గిస్తాం. కలెక్టర్ గా 21 సంవత్సరాల అధికారి బాధ్యతలు నిర్వహించగా 21 సంవత్సరాల వ్యక్తి ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయకూడదు? అని ప్రశ్నించారు.ఈటల లెఫ్టిస్టు… కానీ రైటిస్ట్ పార్టీలోకి పోయేలా చేశాడు. ఈటలకు ఎన్నికల్లో డబ్బులు పంచడం ఇష్టం లేదు. కానీ హుజూరాబాద్ ఎన్నికల్లో ఖర్చు పెట్టించాడు. కేసీఆర్ అనుకున్నదే ఈటలతో చేయిస్తున్నాడు అంటూ రేవంత్ అన్నారు.

Exit mobile version