Home Latest News TSPSC Syllabus | గ్రూప్ 3 సిలబస్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ

TSPSC Syllabus | గ్రూప్ 3 సిలబస్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ

TSPSC Syllabus | తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1365 గ్రూప్ 3 సర్వీసు పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 23 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. జులై లేదా ఆగస్టులో రాత పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో గ్రూప్ 3 పోస్టులకు సంబంధించిన సిలబస్ ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు విద్యార్హతలు, వయోపరిమితి, వేతన స్కేలు, రిజర్వేషన్లు తదితర వివరాలతో పాటు పరీక్ష సిలబస్ ను నోటిఫికేషన్ లో పొందుపరిచింది. అయితే వీటిని ఏ విధంగా నిర్వహిస్తారు అనే దాని మీద స్పష్టత లేదు. కొందరు కంప్యూటర్ ఆధారితంగానా..? ఆఫ్లైన్ లోనా అనేది అధికారులు ఇంకా స్పష్టం చేయలేదు. పరీక్షలు నిర్వహించడానికి ఏడు రోజుల ముందు హాల్ టికెట్లను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రూప్ 3 పరీక్షలో మొత్తంగా మూడు పేపర్లు ఉండనున్నాయి.

ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్షలు నిర్వహస్తారు. ఒక్కో పేపరు రాసేందుకు రెండున్నర గంటల సమయం ఉంటుంది. ఈ సిలబస్ ను టీఎస్‌పీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులోనికి తెచ్చింది. గ్రూప్ 3 పోస్టులకు పోటీపడే అభ్యర్థులు మూడు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ప్రతి పేపర్ లోనూ 150 ప్రశ్నలుంటాయి.

ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ప్రక్రియ జరగదు. రాత పరీక్షలను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. మొదటి పేపర్లో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఉంటుంది. పేపర్ 2 లో మొత్తం 3 అంశాలు ఉండగా.. ప్రతి అంశం పై 50 ప్రశ్నలు.. 50 మార్కులు ఉంటాయి.

Exams
image source : freepik

దీనిలో భారత రాజ్యాంగానికి సంబంధించి 50 మార్కులు, భారత చరిత్రకు సంబంధించి మరో 50 మార్కులు ఇస్తారు. రాష్ట్ర సామాజకి సాంస్కృతిక చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశానికి సంబంధించి 50 మార్కులుంటాయి. పేపర్ 3లో మూడు అంశాలుండగా.. ఒక్కో అంశానికి 50 మార్కులున్నాయి. ఇందులో భారత ఆర్థిక వ్యవస్థ, వచ్చిన మార్పులు వంటి అంశాలున్నాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

Exit mobile version