Home News AP Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.4,42,444 కోట్లు.. జగన్ పాలనలో రెండింతలు అయిన బాకీలు

Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.4,42,444 కోట్లు.. జగన్ పాలనలో రెండింతలు అయిన బాకీలు

Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ అప్పు భారీగా పెరిగిపోయింది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దాదాపు రెండింతలు అయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్య సభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

2019 నుంచి ఏపీ ప్రభుత్వం ఏటా రూ.45వేల కోట్ల అప్పు చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. 2019లో రాష్ట్ర అప్పులు రూ.2,64,451 కోట్లు ఉండగా.. 2020లో రూ.3,07,671 కోట్లు అయ్యియి. 2021లో రూ.3,53,021 కోట్లకు పెరిగాయి. 2022లో సవరించిన అంచనాల తర్వాత రూ.3,93,718 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం 2023లో ఏపీ అప్పు రూ.4,42,442 కోట్లుగా మారిందని పంకజ్ చౌదరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అప్పులు భారీగా పెరిగిపోవడం పట్ల విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఏపీ అప్పులపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘‘ అప్పులతో ఏపీ పేరు మార్మోగిస్తున్నందుకు సీఎం జగన్‌ కు ప్రత్యేక శుభాకాంక్షలు. అప్పులతో ఆంధ్రా పేరును ఇలానే కొనసాగించండి. మీ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం మాత్రం మరచిపోవద్దు. రాష్ట్రాభివృద్ధి, సంపదను కుక్కలకు వదిలేయండి. భారతరత్న మాదిరిగా మీకు అప్పురత్న అవార్డు ఇవ్వాలి’’ అని జగన్ కు చురకలంటించారు పవన్. దీనికి ఒక కార్టూన్ కూడా జత చేశారు. అందులో సీఎంకు ‘అప్పురత్న’ అవార్డు ఇస్తున్నట్లుగా ఉంది. ఈ కార్టూన్‌లోనే తొమ్మిది నెలల్లో ఏపీ రూ.55,555 కోట్లు అప్పు చేసినట్లు పేర్కొన్నారు అని ట్వీట్ చేశారు. ఇది వైసీపీ సర్కారు రికార్డుగా అంటూ పవన్ సెటైర్ వేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

PM Kisan | రైతులకు కేంద్రం మొండిచేయి.. పీఎం కిసాన్ డబ్బులపై కీలక ప్రకటన

Kadiyam Srihari | ఇక్కడ టైమ్‌ వేస్ట్‌.. ఏపీ వెళ్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉంది.. వైఎస్ షర్మిలకు కడియం శ్రీహరి హితవు

Babu mohan | జోగిపేట బీజేపీ కార్యకర్తను బండబూతులు తిట్టిన బాబుమోహన్.. బండి సంజయ్ ఎవడ్రా అంటూ ఫైర్

Teachers | టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. బదిలీ ప్రక్రియలో వాళ్లకూ ఛాన్స్

Turkey Earthquake | తుర్కియే, సిరియాలో భారీ భూకంపం వస్తుందని 3 రోజుల ముందే హెచ్చరిస్తే.. అంతా చులకనగా మాట్లాడారు..

Turkey Earthquake | ప్రపంచంలో ఇప్పటిదాకా వచ్చిన భారీ భూకంపాలు ఇవే..

Exit mobile version