Home Lifestyle Devotional Sankranti Special | కనుమ రోజు కాకి కూడా కదలదు.. అలాంటిది మనుషులు ప్రయాణాలు చేయొచ్చా?

Sankranti Special | కనుమ రోజు కాకి కూడా కదలదు.. అలాంటిది మనుషులు ప్రయాణాలు చేయొచ్చా?

Image by Creative_hat on Freepik

Sankranti Special | తెలుగు రాష్ట్రాల్లో జరిగే పెద్ద పండుగ సంక్రాంతి. భోగ భాగ్యాలు కలగాలని భోగిని.. పితృదేవతలను స్మరించుకుంటూ సంక్రాంతిని.. పశుపక్ష్యాదుల సేవ చేస్తూ కనుమ పండుగను జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ముక్కనుమ అని నాలుగో రోజు కూడా పండుగ చేసుకుంటారు. అయితే ఈ పండుగకు సంబంధించి ఒక సామెత పూర్వం నుంచి ప్రాచుర్యంలో ఉంది. కనుమ రోజు కాకి కూడా కదలదు అనే నానుడిని చెబుతూ ప్రయాణాలు చేయొద్దని చెబుతుంటారు. మరి అది నిజమేనా? కనుమ రోజు ప్రయాణాలు చేస్తే ఏమవుతుంది? ఈ సామెత ఎందుకు పుట్టుకొచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం..

సంక్రాంతి అంటే రైతుల పండుగ. ప్రకృతితో మమేకం కావడానికి మూడు రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటాం. ముఖ్యంగా కనుమ రోజున ఇంట్లో ఉన్న పశువులను ప్రత్యేకంగా అలంకరించి వాటికి సేవ చేసుకుంటారు. వ్యవసాయంలో తమకు చేస్తున్న సాయానికి కృతజ్ఞతగా ఈ రోజు వాటికి విశ్రాంతిని ఇస్తారు. ఈరోజు వాటిని ప్రేమగా చూసుకుంటే పశు, ధనధాన్యాల వృద్ధి జరుగుతుందని పెద్దల విశ్వాసం. వీటి కారణంగానే కనుమ రోజు కాకి కూడా కదలదు అనే సామెత పుట్టుకొచ్చింది. అదెలా అనుకుంటున్నారా?

ఇప్పుడు అంటే కార్లు, బైకులు ఉన్నాయి కానీ పూర్వం బయటకు వెళ్లాలంటే ఎడ్లబండి, గుర్రపు బండిపైనే వెళ్లేవాళ్లు. కానీ కనుమ నాడు మూగజీవాలను హింసించకూడదు కదా. అందుకే ఈ ఒక్కరోజైనా వాటికి విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో బండ్లు కట్టకుండా చేయాలని ఈ సామెతను పూర్వం తీసుకొచ్చారు. ఇది కచ్చితంగా పాటించేందుకు ప్రయాణాలు చేస్తే ఆటంకాలు కలుగుతాయని.. లేని పోని కష్టాలు వస్తాయని భయపెట్టించారు. అదే ఇప్పటికీ కొనసాగుతోంది. కానీ ఇప్పుడు ప్రయాణ పద్ధతులు మారిపోయాయి. కార్లు, బైకులు అంటూ రకరకాల ప్రయాణ వ్యవస్థలు వచ్చాయి. కాబట్టి కనుమ రోజు ప్రయాణాలు చేసిన ఏం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరో కోణం కూడా ఉంది..

సంక్రాంతి రోజు సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్నాడు. దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఇది దేవతలకు ఎంతో ఇష్టమైనది. ఈ సమయంలోనే మరణించిన పితృదేవతలు బయటకు వస్తారని ప్రతీతి. అందుకే సంక్రాంతి పండుక్కి మాంసం, రకరకాల పిండి వంటలు వండి నైవేద్యంగా పెడతారు. ఆ తర్వాత వాటినికి కుటుంబమంతా కలిసి తింటారు. అందుకే ఈ రోజున అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు, పిన్ని బాబాయ్‌లు, అత్తమామలు అని అందరూ ఒక్కచోట చేరి సరదాగా గడుపుతుంటారు. ఇలా సందడిగా ఉన్న సమయంలో కుటుంబసభ్యులంతా కాసేపు సరదాగా గడపాలని.. హడావుడిగా ఎక్కడి వాళ్లు అక్కడికి వెళ్లిపోవద్దనే ఉద్దేశ్యంతో కనుమ రోజు ప్రయాణాలు చేయొద్దని పెద్దలు చెప్పేవాళ్లు. అలా ఈ సామెత ప్రాచుర్యంలోకి వచ్చిందని అంటుంటారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Bhogi special | సంక్రాంతి వేడుకల్లో భోగి మంటలు ఎందుకు వేస్తారు? పురాణాలు ఏం చెబుతున్నాయి? వైద్యులు ఏమంటున్నారు?

Chilkur Balaji Temple | చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి ఈ విషయాలు తెలుసా.. ఇక్కడ ఉండే రావి చెట్టు వెరీ వెరీ స్పెషల్!

Lakshmi Devi | లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి పూజ ఎలా చేయాలి?

Water in Dreams | కలలో తరచూ నీళ్లు కనిపిస్తున్నాయా? మీ కలలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Exit mobile version