Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు ( 29-12-2022 )

Horoscope Today | రాశిఫలాలు ( 29-12-2022 )

Image Source : Pixabay

Horoscope Today | మేషం

వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు.కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. తన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

వృషభం

కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు.

మిథునం

రుణాలను కొంతవరకు తీరుస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఉద్యోగాల్లో హోదాలు పొందుతారు.

కర్కాటకం

శ్రమ అధికం. పనుల్లో తొందరపాటు వద్దు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక బదిలీలు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు.

సింహం

నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలకు దారితీస్తాయి.

కన్య

సోదరులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనుకోని అతిథుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ధనలాభ సూచన ఉంది.

తుల

నూతన మిత్రులు పరిచయమై కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వాహన, భూయోగాలు పొందుతారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.

వృశ్చికం

దూర ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.

ధనుస్సు

పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

మకరం

సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు పొందే సూచన ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. విద్య, వివాహయత్నాలు ఫలిస్తాయి. భూయోగం ఉంది.

కుంభం

ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. వివాదాలు, కోపతాపాలకు దూరంగా ఉండండి. మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ధనలాభ సూచన ఉంది.

మీనం

ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధువుల నుంచి విలువైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆహ్వానాలు అందుకుంటారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Sircilla Rajeswari |దివ్యాంగ రచయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి కన్నుమూత

Corona cases | రాబోయే 40 రోజులు కీలకం.. భారత్‌లో భారీగా కరోనా కేసులు పెరిగే ఛాన్స్!

SSC Exams | 9,10 తరగతుల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. షెడ్యూల్‌ విడుదల.. పరీక్షల విధానంలో మార్పులు

TSPSC Job Notification | తెలంగాణలో మరో రెండు శాఖల్లో జాబ్‌ నోటిఫికేషన్లు విడుదల.. 276 పోస్టులు భర్తీ చేయనున్న సర్కార్‌

Dogs | కుక్కలు ఆకాశంలో చంద్రుణ్ని చూస్తూ ఎందుకు అరుస్తాయి?

Exit mobile version