Saturday, April 20, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Daily | రాశిఫలాలు ( 12-03-2023 )

Horoscope Daily | రాశిఫలాలు ( 12-03-2023 )

Horoscope Daily | మేషం

పనుల్లో పురోగతి సాధిస్తారు. ఇంటా బయటా సానుకూలంగా ఉంటుంది. సంఘంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.

వృషభం

ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. వివాదాలకు దూరంగా ఉండండటం మంచిది. బంధువులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయి. నూతన వస్తు లాభం కలదు.

మిథునం

దూర ప్రాంతాల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం

కొత్త వ్యక్తులతో పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు అందుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

సింహం

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కొత్త మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు సాగిస్తారు.

కన్య

బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఆర్థికఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇంటాబయటా సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి నుంచి స్వల్ప ధనలాభం పొందుతారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.

తుల

చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో స్థానమార్పులు ఉంటాయి. ధనలాభం పొందుతారు.

వృశ్చికం

కొత్త వ్యక్తులు పరిచయమై నూతన వ్యాపారాలు చేపడతారు. పనులు చకచకా సాగుతాయి. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ముఖ్య నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

ధనుస్సు

పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. బాధ్యతలు పెరుగుతాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు.

మకరం

కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు.

కుంభం

పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. వివాహ, ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. ధనలాభం పొందుతారు.

మీనం

నూతన ఉద్యోగాల్లో చేరతారు. పనుల్లో పురోగతి సాధిస్తారు. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. నూతన వస్త్ర లాభం.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Venkatesh Maha | అదో నీచ్ కమీనే స్టోరీ.. కేజీఎఫ్‌ సినిమాపై కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేశ్ మహా సంచలన కామెంట్స్

Janhvi Kapoor | ఎట్టకేలకు టాలీవుడ్‌కు అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌.. NTR30 నుంచి అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌

Khusboo | నా కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించేవాడు.. తన బాధను వెల్లగక్కిన ఖుష్బూ

Amitabh Bachchan | ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో అప‌శ్రుతి.. అమితాబ్ బ‌చ్చ‌న్‌కు గాయాలు

Balakrishna | బాలయ్య కూడా అదే చేయబోతున్నాడా.. ఆహా కోసం మరో ముందడుగు..!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News