Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsVirat Kohli | ఆ క్షణమే నా జీవితంలో మార్పు తీసుకొచ్చింది.. ఎమోషనల్ అయిన విరాట్...

Virat Kohli | ఆ క్షణమే నా జీవితంలో మార్పు తీసుకొచ్చింది.. ఎమోషనల్ అయిన విరాట్ కోహ్లీ

Virat Kohli | టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌ లో ఎన్నో ఎత్తు పల్లాలను చవి చూశాడు. సమారు పదిన్నర సంవత్సరాల నుంచి భారత్ క్రికెట్‌ జట్టులో తనదైన ముద్ర వేసుకొని ఆటగాడి, నాయకుడిగా, మార్గదర్శకుడిగా ఉన్న కోహ్లీ.. తాజాగా తన జీవితానికి సంబంధించిన కొన్ని కీలక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఓ సంఘటన తన లైఫ్‌ ను పూర్తిగా మార్చేసిందని చెప్పుకొచ్చాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చే సీజన్ కోసం సిద్ధమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విడుదల చేసిన పోడ్‌కాస్ట్‌లో కోహ్లీ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా తన లైఫ్ చేంజింగ్ మూమెంట్‌ను తెలియజేశాడు. నాన్న చనిపోయినప్పుడు, అండర్19 క్రికెట్ కెప్టెన్‌గా వరల్డ్ కప్ గెలవడం, టీమిండియాకు సారథిగా ఎంపిక కావడం.. వీటిలో ఏదో ఒకటి నా లైఫ్ చేంజింగ్ మూమెంట్ అని అందరూ అనుకుంటారని కోహ్లీ చెప్పాడు. కానీ అవేవీ కాదని.. అనుష్కను కలవడమే తన జీవితంలో తీసుకొచ్చిన గొప్ప మార్పు అని తెలిపాడు.

‘మా నాన్న చనిపోయినప్పుడు నా దృక్పథం మారిపోయింది. నా చుట్టూ ఉన్న జీవితం మాత్రం ఎప్పటిలాగే ఉంది. నాన్న చనిపోయాక నేను జీవితంలో ఏం చేయాలనుకుంటున్నానో దానిపై పూర్తి స్పష్టత వచ్చింది. నా కలను సాకారం చేసుకోవడానికి నేనేం చేయాలో పూర్తి అవగాహన వచ్చింది. అది నా జీవితాన్ని మార్చిన ఘటన అయితే కాదు. నేను గతంలో మాదిరిగానే క్రికెట్ ఆడుతున్నాను. నా చుట్టూ వాతావరణం కూడా సాధారణంగానే ఉంది. కానీ అనుష్కను కలవడం నా జీవితంలో లైఫ్ ఛేంజింగ్ మూమెంట్ అని చెప్పగలను. ఎందుకంటే అనుష్కను కలిశాక నేను నా లైఫ్ ను చాలా భిన్నంగా చూశాను. నా గత జీవితానికి దీనికి సంబంధమే ఉండకుండా ఉండే లైఫ్ అది. ఎందుకంటే మీరు ప్రేమలో ఉన్నప్పుడు మీలో కలిగే మార్పులను మీరు ప్రాసెస్ చేయడం ప్రారంభిస్తారు. అందుకు అనుగుణంగా మీరు కదలాలి. ప్రేమలో ఉంటే చాలా విషయాలు అంగీకరించాలి. అందుకే అది నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.’అని కోహ్లీ తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరూ చాలాకాలం డేటింగ్ తర్వాత సీక్రెట్‌గా కొద్ది మంది అతిథుల సమక్షంలో 2017లో పెళ్లి చేసుకున్నారు. అప్నట్నుంచి దాంపత్య జీవితాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. వీరికి 2021 జవనరిలో ఒక పాప కూడా పుట్టింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకం విధివిధానాలు ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. దరఖాస్తులు ఎలా.. రూ.3లక్షలు ఎప్పుడు ఇస్తారు?

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..

Influenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్‌!

Traffic Challan | ప్రాణాలు తీసిన ట్రాఫిక్‌ చలాన్లు.. కట్టలేను సారు అన్నా వినలేదు.. హైదరాబాద్‌లో దారుణం!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News