Home Lifestyle Horoscope & Vaasthu horoscope today | రాశిఫలాలు ( 24-01-2023 )

horoscope today | రాశిఫలాలు ( 24-01-2023 )

Image Source : Pixabay

horoscope today | మేషం

చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. జీవిత భాగస్వామి సలహాతో నూతన వ్యాపారాలు చేపడతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. స్వల్ప లాభాలు పొందుతారు

వృషభం

కుటుంబ సభ్యులతో ఏర్పడిన విబేధాలు తొలగుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు. శుభవార్తలు వింటారు.

మిథునం

ఆర్థిక ప్రగతి సాధిస్తారు. బాకీలు వసూలవుతాయి. పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు. భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.

కర్కాటకం

బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. రుణబాధలు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటర్వ్యూ్ల్లో విజయం సాధిస్తారు. సంతాన సమస్యల నుంచి బయటపడతారు. క్రయవిక్రయాల్లో విజయం సాధిస్తారు. వస్తు లాభ సూచన ఉంది.

సింహం

పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. సన్నిహితుల సాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రులతో ఏర్పడిన వైరాన్ని పరిష్కరించుకుంటారు. అనుకోని అతిథులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుకుంటారు.

కన్య

ఉద్యోగాల్లో మంచి మార్పులు ఉంటాయి. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలు కొంతవరకు తీరుతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సోదరులను కలుసుకుంటారు.

తుల

వివాహ, ఉద్యోగ యత్నాల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థికలాభాలు అందుకుంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. నూతన వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు.

వృశ్చికం

దూర ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. సోదరులతో ఏర్పడిన విబేధాలు పరిష్కరించుకుంటారు. శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది.

ధనుస్సు

వృత్తి, వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో్ వారికి సన్మాన యోగం. మిత్రులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. స్వల్ప ధన లాభ సూచన ఉంది.

మకరం

కొత్త పెట్టుబడులకు అనుకూలమైన కాలం. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. సోదరులతో ఏర్పడిన విబేధాలు పరిష్కరించుకుంటారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది.

కుంభం

మిత్రుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. సంతాన సమస్యల నుంచి బయటపడతారు. శుభవార్తలు వింటారు.

మీనం

దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమై ఊరట చెందుతారు. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. నూతన వస్తు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

Exit mobile version