Home Lifestyle Horoscope & Vaasthu Horoscope today | రాశిఫలాలు ( 16-01-2023)

Horoscope today | రాశిఫలాలు ( 16-01-2023)

Image Source : Pixabay

Horoscope today | మేషం

కుటుంబసభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి

వృషభం

పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు తీసుకోవడం మంచిది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.

మిథునం

పనుల్లో జాప్యం జరిగినప్పటికీ పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు తగిన డబ్బు అందుతుంది. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. సోదరుల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది.

కర్కాటకం

వ్యవహారాల్లో అవరోధాలు ఏర్పడినప్పటికీ అధిగమిస్తారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.

సింహం
శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి కలిగే అవకాశం ఉంది.

కన్య

మిత్రులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగిపోతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. అనుకోని అతిథుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిడి తొలగిపోతుంది.

తుల

ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగాల్లో ఏర్పడిన చికాకులు తొలగిపోతాయి

వృశ్చికం

ముఖ్యమైన పనుల్లో ఎదురైన ఆటంకాలను మిత్రుల సహాయంతో తొలగించుకుంటారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

ధనుస్సు

విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. పాత బాకీలు అసూలు అవుతాయి. పెండింగ్‌లో ఉన్న ఆస్తి వివాదాలు తీరిపోతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందే అవకాశం ఉంది. సోదరుల నుంచి విలువైన సమాచారం అందుతుంది.

మకరం

సమాజంలో ఆదరణ లభిస్తుంది. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు స్థాన చలన సూచనలు ఉన్నాయి.

కుంభం

ఆర్థిక వ్యవహారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తు లాభం ఉంది.

మీనం

ధన, వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగాల్లో ఎదురైన చిక్కులు తొలగిపోతాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Bhogi special | సంక్రాంతి వేడుకల్లో భోగి మంటలు ఎందుకు వేస్తారు? పురాణాలు ఏం చెబుతున్నాయి? వైద్యులు ఏమంటున్నారు?

Lakshmi Devi | లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి పూజ ఎలా చేయాలి?

Water in Dreams | కలలో తరచూ నీళ్లు కనిపిస్తున్నాయా? మీ కలలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Exit mobile version