Friday, May 17, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు ( 13-03-2023)

Horoscope Today | రాశిఫలాలు ( 13-03-2023)

Horoscope Today | మేషం

పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. వివాహ యత్నాలు సాగిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం పొందుతారు

వృషభం

దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయత్న కార్యసిద్ది సాధిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి తగాదాలు తీరి ఊరట చెందుతారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి.

మిథునం

దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటాబయటా ఎదురైన ఒత్తిడులు తొలగుతాయి. పనుల్లో జాప్యం జరిగినా సన్నిహితుల సహయంతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం విషయంలో మెలకువ అవసరం.

కర్కాటకం

ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. కుటుంబసభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.

సింహం

మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. భూ, గృహయోగాలు పొందుతారు. స్వల్ప ధనలాభం పొందుతారు.

కన్య

కొత్త వ్యక్తులు పరిచయమై సహాయం అందిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగపడుతుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు.

తుల

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. పనుల్లో తొందరపాటు తగదు. సన్నిహితుల నుంచి సహాయం అందుకుంటారు. ఆరోగ్యం, వాహనాల విషయంలో మెలకువ చాలా అవసరం. విలువైన వస్తువులు భద్రంగా చూసుకోండి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

వృశ్చికం

వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. కుటుంబ సభ్యుల సలహాతో నూతన కార్యక్రమాలు చేపడతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.

ధనుస్సు

బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రులతో సఖ్యతగా మెలగుతారు. విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది.

మకరం

కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. వివాహయత్నాలు కలిసి వస్తాయి. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్తు సేకరణ సూచన ఉంది.

కుంభం

బంధువర్గంతో ఏర్పడిన వివాదాలు సర్దుబాటు అవుతాయి. సోదరుల నుంచి ఆస్తి లాభం పొందుతారు. పనుల్లో జాప్యం జరిగినా విజయం సాధిస్తారు. ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగాల్లో అనుకూలమైనవి.

మీనం

చేపట్టిన పనుల్లో జాప్యం జరిగినా మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వాహన సౌఖ్యం కలదు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Venkatesh Maha | అదో నీచ్ కమీనే స్టోరీ.. కేజీఎఫ్‌ సినిమాపై కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేశ్ మహా సంచలన కామెంట్స్

Janhvi Kapoor | ఎట్టకేలకు టాలీవుడ్‌కు అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌.. NTR30 నుంచి అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌

Khusboo | నా కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించేవాడు.. తన బాధను వెల్లగక్కిన ఖుష్బూ

Amitabh Bachchan | ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో అప‌శ్రుతి.. అమితాబ్ బ‌చ్చ‌న్‌కు గాయాలు

Balakrishna | బాలయ్య కూడా అదే చేయబోతున్నాడా.. ఆహా కోసం మరో ముందడుగు..!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News