Monday, April 15, 2024
- Advertisment -
HomeLatest NewsIND vs AUS | కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌.. విరాట్‌ కోహ్లీ భారీ సెంచరీ.. భారత్‌...

IND vs AUS | కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌.. విరాట్‌ కోహ్లీ భారీ సెంచరీ.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 571

IND vs AUS | టైమ్‌ 2 న్యూస్‌, అహ్మదాబాద్‌: అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అద్భుత క్షణం అహ్మదాబాద్‌లో ఆవిష్కృతమైంది. 2019 నవంబర్‌ నుంచి సుదీర్ఘ ఫార్మాట్‌లో సెంచరీ చేయని విరాట్‌ కోహ్లీ (364 బంతుల్లో 186; 15 ఫోర్లు) ఎట్టకేలకు మూడంకెల స్కోరు అందుకున్నాడు. దీంతో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులు చేసింది.

బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న వికెట్‌పై స్వేచ్ఛగా ఆడిన మాజీ కెప్టెన్‌ ఒక దశలో డబుల్‌ సెంచరీ చేసేలా కనిపించినా.. సహచరులు వెనుదిరుగుతుండటంతో భారీ షాట్‌కు యత్నించి ద్విశతకానికి 14 పరుగుల దూరంలో పెవిలియన్‌ చేరాడు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ (79; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), వికెట్‌ కీపర్‌ కోన శ్రీకర్‌ భరత్‌ (44; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ఆడారు. వెన్ను నొప్పి కారణంగా శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌కు రాకపోగా.. టీమ్‌ఇండియా పది మందితోనే ఇన్నింగ్స్‌ ముగించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్‌ లియాన్‌, టాడ్‌ మార్ఫి చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ ఆదివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. చేతిలో 10 వికెట్లు ఉన్న ఆసీస్‌.. భారత స్కోరుకు ఇంకా 88 పరుగులు వెనుకబడి ఉంది. నేడు ఆటకు ఆఖరి రోజు.

డబుల్‌ మిస్‌..

ఓవర్‌నైట్‌ స్కోరు 289/3తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన టీమ్‌ఇండియా.. ఆడుతూ పాడుతూ ముందుకు సాగింది. కోహ్లీ పూర్తి నియంత్రణతో షాట్లు ఆడగా.. మార్ఫి బౌలింగ్‌లో జడేజా ఔటయ్యాడు. అయ్యర్‌ వెన్నునొప్పితో బాధపడుతుండటంతో ఆరో స్థానంలో భరత్‌ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2019లో బంగ్లాదేశ్‌పై డే అండ్‌ నైట్‌ టెస్టులో సెంచరీ చేసిన అనంతరం టెస్టు ఫార్మాట్‌లో విరాట్‌ మూడంకెల స్కోరు చేయడం ఇదే తొలిసారి. దీంతో మూడు ఫార్మాట్లలో కలిపి విరాట్‌ 75వ శతకం తన పేరిట లిఖించుకున్నాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వంద శతకాలతో టాప్‌లో ఉన్నాడు. ఫోర్లు, సిక్సర్లతో ఆసీస్‌ బౌలర్లపై విరుచుకుపడిన భరత్‌ ఉన్నంతసేపు వేగంగా ఆడగా.. అక్షర్‌ పటేల్‌ రాకతో ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. అప్పటికే క్రీజులో గంటల తరబడి సమయం గడిపిన కోహ్లీ.. కంగారూ బౌలర్ల సహనాన్ని పరీక్షించగా.. మరో ఎండ్‌ నుంచి వీలుచిక్కినప్పుడల్లా అక్షర్‌ భారీ షాట్‌లు ఆడాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఆరోవికెట్‌కు వీరిద్దరూ కలిసి 215 బంతుల్లోనే 162 పరుగులు జోడించడం విశేషం. అయితే అక్షర్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేయడం ద్వారా స్టార్క్‌ ఈ భాగస్వామ్యాన్ని విడదీయగా.. ఆ తర్వాత అశ్విన్‌ (7), ఉమేశ్‌ యాదవ్‌ (0) వెంటవెంటనే ఔటయ్యారు. భారీ షాట్‌కు యత్నించిన విరాట్‌.. బౌండ్రీ సమీపంలో లబుషేన్‌ పట్టిన క్యాచ్‌కు పెవిలియన్‌ బాటపట్టాడు. ఫలితంగా రోహిత్‌ సేనకు 91 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News