Thursday, May 2, 2024
- Advertisment -
HomeNewsInternationalChatGPT | రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ఎలా ఆపాలో పరిష్కారం చెప్పిన చాట్‌జీపీటీ

ChatGPT | రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ఎలా ఆపాలో పరిష్కారం చెప్పిన చాట్‌జీపీటీ

ChatGPT | ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.. చాట్ జీపీటీ. ఎలాంటి క్లిష్టమైన ప్రశ్నలకైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సులువుగా ఇది సమాధానాలు ఇస్తోంది. అందుకే తమకు తెలియని విషయాలను తెలుసుకునేందుకు చాలామంది చాట్ జీపీటీ సహాయం తీసుకుంటున్నారు. చాట్ జీపీటీ కూడా అనూహ్య స్పందనలు ఇవ్వడంతో అవి వైరల్ అవుతున్నాయి కూడా. దీంతో విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి, ప్రముఖ రచయిత వికాస్ స్వరూప్ కూడా చాట్ జీపీటీని ఓ ప్రశ్న అడిగారు. దానికి ఏఐ ఇచ్చిన సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ దేని గురించి అడిగారని అనుకుంటున్నారా? ఏడాది కాలంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ఆపాలని అడిగారు.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ఆపాలో తెలియక ప్రపంచ దేశాలే సైలెంట్‌గా ఉంటున్న ఈ తరుణంలో చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. యుద్ధం ఆగాలంటే ఆ రెండు దేశాలే కాదు.. అంతర్జాతీయ సమాజం చేపట్టాల్సిన చర్యలను చాట్‌ జీపీటీ వివరించింది. మొత్తంగా 8 సూచనలను చేసింది. వాటిని వికాస్ స్వరూప్ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. ఇందులో ఏముందంటే.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం చాలా సంక్లిష్టమైన సమస్య అని, ఇరు వర్గాలను ఒప్పించి పరిష్కారం సాధించడం అంత సులభం కాదని ముందే స్పష్టం చేసింది. అయితే ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఉక్రెయిన్ ను ఆర్థికంగా ఆదుకోవాలని చాట్ జీపీటీ సూచించింది. ఉక్రెయిన్ భౌగోళిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని రష్యా అంగీకరించాలని పేర్కొంది. ఉక్రెయిన్‌లో రష్యన్ భాష మాట్లాడే ప్రాంతాల చారిత్రక, సాంస్కృతిక హక్కుల పరిరక్షణ కోసం రష్యా, ఉక్రెయిన్ ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని సూచించింది. విద్యా సంస్థలు, ప్రభుత్వ సమాచార విధానాల్లో రష్యన్ భాషను భాగం చేయాలని సూచించింది. రెండు దేశాల సరిహద్దుల నుంచి సైనికులను వెనక్కు పిలిపించి, ఆ ప్రాంతాలను డీమిలటరైజ్ చేయాలని కూడా సలహా ఇచ్చింది.

ఉక్రెయిన్ లోని రష్యన్ భాష మాట్లాడే ప్రాంతాలను డీసెంట్రలైజ్ చేయాలని చాట్ జీపీటీ సూచించింది. అలాగే, యుద్ధ విరమణ అగ్రిమెంట్ కుదిరిన తరువాత ఆ అగ్రిమెంట్ అమలు కావడానికి అంతర్జాతీయ వ్యవస్థ మానిటర్ చేయాలని పేర్కొంది. ఈ సమస్య పరిష్కారానికి ముందుగా, రెండు దేశాలు యుద్ధ విరమణకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. తక్షణమే కాల్పుల విరమణ పాటించి, ఒక తటస్థ వేదికపై చర్చలు జరపాలని సూచించింది.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి చాట్ జీపీటీ చేసిన సూచనలను వికాస్ స్వరూప్ ట్విటర్ లో పంచుకున్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు. యుద్ధాలకు, సంక్షోభాలకు కారణమయ్యే నేతలు.. చాట్ జీపీటీ వంటి కృత్రిమ మేథలకు అర్థం కానంత నిర్హేతుకంగా ఉంటారని వ్యాఖ్యానించారు. చాట్ జీపీటీ చేసిన సూచనలను రష్యా, ఉక్రెయిన్ రెండూ అంగీకరించబోవన్నారు. అయితే, వికాస్ స్వరూప్ ప్రయత్నం ఆసక్తికరంగా ఉందని శశి థరూర్ అన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకం విధివిధానాలు ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. దరఖాస్తులు ఎలా.. రూ.3లక్షలు ఎప్పుడు ఇస్తారు?

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

Microsoft CEO Satya Nadella | కోడింగ్‌ రాకపోయినా సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొచ్చు అంటున్న సత్య నాదెళ్ల.. ఎలా?

Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..

Influenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్‌!

Traffic Challan | ప్రాణాలు తీసిన ట్రాఫిక్‌ చలాన్లు.. కట్టలేను సారు అన్నా వినలేదు.. హైదరాబాద్‌లో దారుణం!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News