Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు ( 12-01-2022 )

Horoscope Today | రాశిఫలాలు ( 12-01-2022 )

Image Source : Pixabay

Horoscope Today | మేషం

ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పనుల్లో తొందరపాటు వద్దు. ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయమవుతారు. పాత బాకీలు వసూలు అవుతాయి. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. నూతన వస్తువులు సేకరిస్తారు.

వృషభం

కుటుంబసభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఎదురైన ఒడిదొడుకులు కొంత వరకు తీరుతాయి. సోదరులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. కోపతాపాలకు దూరంగా ఉండండి. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

మిథునం

సంఘంలో గౌరవం పొందుతారు. ఆకస్మిక ధనలాభ సూచన ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యుల సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వాహన సౌఖ్యం కలదు.

కర్కాటకం

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. పాత మిత్రుల నుంచి ధన లాభం పొందుతారు.

సింహం

ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో లాభాలు పొందుతారు. సోదరులతో ఏర్పడిన ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సాంకేతిక విద్య అవకాశాలు పొందుతారు.

కన్య

ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. జీవిత భాగస్వామి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి.

తుల

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్యం, వాహనాల విషయంలో కాస్త మెలకువ అవసరం. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయసహకారాలు అందుతాయి.

వృశ్చికం

ఇంటి విషయాలపై శ్రద్ధ చూపుతారు. అనుకోని అతిథుల నుంచి వచ్చిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. పోటీ పరీక్షల్లో చురుగ్గా పాల్గొంటారు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.

ధనుస్సు

పనులు నిదానంగా సాగుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకు పెడతాయి. జీవిత భాగస్వామి సహాయం పొందుతారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. ధన లాభం ఉంది.

మకరం

ఆరోగ్య సమస్యలు తీరి ఊరట చెందుతారు. రుణాలు కొంతవరకు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కుంభం

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వివాహ, ఉద్యోగ యత్నాలకు అనుకూలంగా ఉంటుంది. సంతానం సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. వస్తు లాభం ఉంది.

మీనం

పాత మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. రాజకీయ, పారిశ్రామిక రంగాల్లోని వారు సన్మానాలు పొందుతారు. ఉద్యోగ, వివాహయత్నాలు అనుకూలిస్తాయి. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. వాహనాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

Lord Shiva | శివునికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పంచారామాల విశిష్టత ఏంటి?

Exit mobile version