Home Latest News Microsoft | విండోస్‌ 7 వాడే వారికి షాకింగ్‌ న్యూస్‌.. వెంటనే ఈ పనిచేయమని మైక్రోసాఫ్ట్‌...

Microsoft | విండోస్‌ 7 వాడే వారికి షాకింగ్‌ న్యూస్‌.. వెంటనే ఈ పనిచేయమని మైక్రోసాఫ్ట్‌ హెచ్చరిక

Image Source : Pixabay

Microsoft | మైక్రోసాఫ్ట్‌ పాత ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వాడే వారికి షాకింగ్‌ న్యూస్‌ ! విండోస్‌ 7, విండోస్‌ 8 ఓఎస్‌లకు సపోర్ట్‌ నిలిపివేయనున్నట్టు మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. పాత ఓఎస్‌లను వినియోగిస్తున్న యూజర్లు వెంటనే విండోస్‌ 10కి అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. జనవరి 10 తర్వాత నుంచి విండోస్‌ 7, 8 ఓఎస్‌లకు తమ సంస్థ విడుదల చేసే టెక్నికల్‌, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందుబాటులో ఉండవని మైక్రోసాఫ్ట్‌ పేర్కొంది. ఇక ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ 109 బ్రౌజర్‌, గూగుల్‌ క్రోమ్‌ వెబ్‌ బ్రౌజర్లు కూడా ఈ ఓఎస్‌ల్లో పనిచేయవని స్పష్టం చేసింది. యూజర్లకు కొత్త టెక్నాలజీ, మెరుగైన భద్రత కల్పించాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మైక్రోసాఫ్ట్‌ సంస్థ వెల్లడించింది.

ఎలా అప్‌డేట్‌ చేసుకోవాలి?

ప్రస్తుతం విండోస్‌ 7 లేదా విండోస్‌ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌ వినియోగిస్తున్న యూజర్లకు విండోస్‌ 10కి అప్‌డేట్‌ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా కంప్యూటర్‌ సెట్టింగ్స్‌లో అప్‌డేట్స్‌లోకి వెళ్తే విండోస్‌ అప్‌డేట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి విండోస్‌ 10కి అప్‌డేట్‌ చేయవచ్చు. అప్‌డేట్‌ ప్రాసెస్‌ పూర్తయిన తర్వాత సిస్టమ్‌ను రీస్టార్ట్‌ చేయాలి.

ఓఎస్‌ ఒక్కటే అప్‌డేట్‌ చేస్తే సరిపోదు

ఇప్పుడు మార్కెట్‌లోకి వస్తున్న కంప్యూటర్స్‌ అన్నీ హైస్పీడ్‌, హైపర్ఫార్మెన్స్‌తో వస్తున్నాయి. వీటిల్లో చాలావరకు విండోస్‌ 11 ఓఎస్‌ను వాడుతున్నారు. అదే పాత కంప్యూటర్స్‌లో విండోస్‌ 10 గానీ 11 గానీ అప్‌డేట్‌ చేసుకోవాలంటే హార్డ్‌వేర్‌ ఫీచర్స్‌ కొన్నింటిని మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా విండోస్‌ 11కి అప్‌గ్రేడ్‌ కావాలంటే 64 బిట్‌సిస్టమ్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజి, 1జీహెచ్‌జెడ్‌ డ్యూయల్‌ కోర్‌ ప్రాసెసర్‌ వంటివి కనీస ఫీచర్లు ఉండాలి. అప్పుడే విండోస్‌ 10 గానీ విండోస్‌ 11 గానీ అప్‌డేట్‌ చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి పాత కంప్యూటర్స్‌లో వీటికి తగ్గట్టుగా హార్డ్‌వేర్‌ మార్పులు చేయాల్సి ఉంటుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Smart phone | కొత్త స్మార్ట్ ఫోన్ కొంటే ఏడాది కాకుండానే ఎందుకు పాడవుతున్నాయి?

Whatsapp | మళ్లీ ఆ ఫీచర్‌ను తీసుకొస్తున్న వాట్సాప్.. రీజన్ ఇదే

Unlock your mobile | మీ మొబైల్ పిన్ మరిచిపోయారా? ఫోన్ను ఇలా అన్లాక్ చేయండి

Tech tips | మీకు వచ్చే ప్రతి మెయిల్స్ ఓపెన్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే మీ పని అంతే !

Exit mobile version