Home Lifestyle Devotional Thursday | గురువారం ఈ పనులు చేస్తే అప్పుల్లో కూరుకుపోతారు

Thursday | గురువారం ఈ పనులు చేస్తే అప్పుల్లో కూరుకుపోతారు

Image by Waewkidja on Freepik

Thursday | శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి గురువారాన్ని అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజు విష్ణుమూర్తిని పూజిస్తే మిగిలిన రోజుల్లో వచ్చిన దానికంటే అనేక రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుందంటారు. ఈ రోజున విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరతాయి. అదేవిధంగా విష్ణుమూర్తికి ప్రతిబింబమైన బృహస్పతికి కూడా గురువారం అంటే ఎంతో ప్రీతిపాత్రమే. కాబట్టి గురుడి అనుగ్రహం మన మీద ఉండాలంటే కొన్ని పనులను ఈ రోజు అస్సలు చేయకూడదు. ఒకవేళ చేస్తే జీవితాంతం బాధ పడాల్సి వస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు.

✰ గురువారం రోజున మహిళలు తలంటు స్నానం చేయకూడదు. దీనివల్ల ఆ మహిళ భర్తకు, పిల్లలకు మంచిది కాదని పండితులు చెబుతుంటారు. పురుషులు జుట్టు కత్తిరించుకోవద్దు. షేవింగ్‌ చేసుకోవద్దు. గోళ్లను కూడా కత్తిరించవద్దు. దీనివల్ల జాతకంలో గురుడు క్షీణిస్తాడు. దీనివల్ల చేసే పనుల్లో అనేక సమస్యలు ఎదురవుతాయి. అష్ట దరిద్రాలు వెంటాడుతాయి.

✰ గురువారం ఇంట్లో బూజు దూలపకూడదు. పూజా గదిలోని వ్యర్థాలను బయటపడేరాదు. గురువారం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీసమేతుడైన విష్ణుమూర్తి ఫొటోను పూజించడం వల్ల ఇంట్లో సకల సంపదలు నెలకొంటాయని పండితులు చెబుతుంటారు.

✰ ఆర్థిక లావాదేవీలకు గురువారం సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. ఈ రోజు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. ఎవరి నుంచీ అప్పు తీసుకోవద్దు. ఒకవేళ ఇలా చేస్తే జాతకంలో గురుడి స్థానం బలహీనమవుతుంది. ఇది ఆర్థిక సంక్షోభానికి దారితీయవచ్చు.

✰ కత్తులు, కత్తెర, సూదులు వంటి పదునైన వస్తువులను గురువారం కొనుగోలు చేయడం మంచిది కాదు. దీనివల్ల ఇంట్లో విబేధాలు తలెత్తే అవకాశం ఉంది. అదే ఈ రోజు స్థిరాస్తి కొనుగోలు చేయడం శుభప్రదం. గురువారం భూములు కొనుగోలు చేయడాన్ని అదృష్టంగా పరిగణిస్తారు.

✰ ఇవాళ ఇంటికి వచ్చిన సాధువులకు, పశుపక్ష్యాదులకు ఆహారం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

Lord Shiva | శివునికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పంచారామాల విశిష్టత ఏంటి?

Exit mobile version