Home Lifestyle Do you know Vaasthu Tips | ఈ చెట్లు మీ ఇంట్లో ఉంటే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం

Vaasthu Tips | ఈ చెట్లు మీ ఇంట్లో ఉంటే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం

Vaasthu Tips | గ్రీనరీపై ఇప్పుడు ప్రజల్లో చాలావరకు అవగాహన వచ్చింది. ఇంటి ముందు కొంచెం ఖాళీ ప్లేస్ ఉన్నా చెట్లను పెంచేస్తున్నారు. అపార్ట్‌మెంట్లలో ఉండేవారు కూడా తొట్టెల్లో చిన్న చిన్న మొక్కలను పెంచుతున్నారు. అయితే ఇంటి ఆవరణ లోపల అన్ని చెట్లను పెంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చెట్లు మన ఇంట్లో ఉంటే ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఇంట్లో పెంచుకోకూడని చెట్లు ఏంటో చూద్దాం..

ఖర్జూర చెట్టు

ఖర్జూర చెట్లు చూడ్డానికి అందంగా కనిపిస్తాయి. కానీ వీటిని ఇంటి ముందు నాటడం అంత మంచిది కాదు. ఈ చెట్టు ఇంట్లో ఉంటే ఆర్థిక పురోగతి ఆగిపోతుందని చెబుతుంటారు.

రేగు చెట్టు

రేగు చెట్లు ఇంట్లో ఉండటం శుభసూచికం కాదు. ముళ్ల చెట్లు ఇంట్లో ఉంటే ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని చెబుతుంటారు. ఆర్థికంగా నష్టపోతారని, డబ్బు కొరత ఏర్పడుతుందని అంటారు. ముళ్ల చెట్లు ఉన్న ఇంట లక్ష్మీదేవి నివసించదు. అందుకే రేగు చెట్లను ఇంటి ఆవరణలో పెంచకూడదు.

చింత చెట్టు

వాస్తు శాస్త్రం ప్రకారం చింత చెట్టు ప్రతికూల ప్రభావాలు చూపిస్తుంది. భూత, ప్రేతాల భయం కూడా ఉంటుంది. చింత చెట్టు ఇంట్లో ఉంటే కుటుంబసభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే చింత చెట్టును ఇంటికి దగ్గరలో ఉంచుకోవద్దు.

జిల్లేడు చెట్టు

జిల్లేడు చెట్టు కూడా ప్రతికూల శక్తిని కలిగి ఉంటుంది. ఇది ఇంట్లో ఉంటే అందరూ అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుందని చెబుతుంటారు. కాబట్టి వీటిలో ఇంట్లో ఉంచుకోవద్దు.

రావి చెట్టు

ఏ ఆలయానికి వెళ్లినా మనకు రావి చెట్టు కనిపిస్తుంటుంది. దీని చుట్టూ తిరిగితే దోషాలు పోయి మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. దీనికి సానుకూల శక్తి ఉన్న మాట నిజమే అయినా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెరగనివ్వకూడదు. ఇది ఇంట్లో ఉంటే సంపద మొత్తాన్ని హరించేస్తుంది. అందుకే రావి చెట్టును కేవలం ఆలయాలు, పవిత్ర స్థలాల్లో మాత్రమే పెరగనివ్వాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Exit mobile version