Home Lifestyle Horoscope & Vaasthu Daily Horoscope | రాశిఫలాలు (05-04-2023 )

Daily Horoscope | రాశిఫలాలు (05-04-2023 )

Image Source : Pixabay

Daily Horoscope | మేషం

పట్టుదలతో ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు.

వృషభం

అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

మిథునం

కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు.

కర్కాటకం

వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురై చికాకుక పెడతాయి. శ్రమకు తగిన ఫలితం కష్టమే. సన్నిహితుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనలాభం ఉంది.

సింహం

కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి.

కన్య

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. సోదరుల నుంచి సహాయం అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం, వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. వస్తు లాభం పొందుతారు.

తుల

మిత్రులతో ఏర్పడిన మాటపట్టింపులు పరిష్కరించుకొంటారు. కుటుంబసభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.

వృశ్చికం

బందువులతో అకారణంగగా వివాదాలు ఏర్పడవచ్చు. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. షేర్లు, భూముల క్రయవిక్రయాల్లో అభివృద్ధి సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

ధనుస్సు

పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సంఘంలో గౌరవం పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి.

మకరం

రుణాలు తీరుస్తారు. బంధువుల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహన యోగం ఉంది. నూతన మిత్రులు పరిచయమైన నూనత కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

కుంభం

ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

మీనం

ముఖ్యమైన కార్యక్రమాల్లో అవరోధాలు ఏర్పడినప్పటికీ సన్నిహితుల సాయంతో పూర్తిచేస్తారు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం పొందుతారు. వాహనాలు కొనుగోలుచేస్తారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

CPR | గుండెపోటు వచ్చినవాళ్లకు సీపీఆర్ చేస్తే బతికే ఛాన్స్ ఉందా.. ఎలాంటి సమయంలో సీపీఆర్ చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Raavi Chettu | రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే అంత ప్రమాదామా?

Exit mobile version