Home Entertainment Nikhil Siddhartha | హీరో అవుదామని 5 లక్షలు ఇచ్చి మోసపోయిన యంగ్ హీరో నిఖిల్

Nikhil Siddhartha | హీరో అవుదామని 5 లక్షలు ఇచ్చి మోసపోయిన యంగ్ హీరో నిఖిల్

Nikhil Siddhartha | టాలీవుడ్ యంగ్ హీరోల్లో నిఖిల్ సిద్ధార్థ్ ఇప్పుడు వరుస సక్సెస్‌తో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాదిలోనే వరుసగా రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని దూకుడు చూపిస్తున్నాడు. కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్నాడు. శుక్రవారం రిలీజైన 18 పేజిస్ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న నిఖిల్.. ఈస్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని పాతరోజులను గుర్తు చేసుకున్నాడు. కొందర్ని నమ్మి మోసపోయానని కూడా అసలు విషయం బయటపెట్టాడు.

హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చానని చెప్పిన నిఖిల్.. తన సినీ కెరీర్ ఎలా మొదలైందో వివరించాడు. హీరోగా ఛాన్స్ కావాలంటే అందరూ నవ్వుతారని.. ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుందో తెలుసుకోమని సుధీర్ వర్మ సలహా ఇచ్చాడు. దీంతో హైదరాబాద్ నవాబ్స్ సహా పలు సినిమాలకు నిఖిల్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అదే సమయంలో నిఖిల్‌కు సీరియల్స్‌లో అవకాశం వచ్చింది. చదరంగం సీరియల్‌లో 40 ఎపిసోడ్స్ కూడా చేశాడు. ఆ తర్వాత కూడా వరుస అవకాశాలు వచ్చాయి. కానీ ఇలా చేస్తూ పోతే ఇక్కడే ఉండిపోతామని.. మళ్లీ సినిమాలకు ఆడిషన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు.

ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ నిఖిల్ యాక్టింగ్ నచ్చి ఆఫర్లు ఇస్తామని చెప్పారు. కానీ అవి ఏవేవో కారణాలతో ఆగిపోయాయి. అలాంటి సమయంలో హీరో అవ్వాలంటే 50 లక్షలు, కోటి రూపాయలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. వాళ్ల మాటలు నమ్మి నిఖిల్ ఒక వ్యక్తికి 5 లక్షలు కూడా ఇచ్చాడు. సదరు వ్యక్తి నిఖిల్‌ను నమ్మించేందుకు ఒక లక్ష రూపాయలతో కొద్ది రోజులు షూటింగ్ కూడా చేశాడు.ఆ తర్వాత అదంతా ఫేక్ అని తెలియడంతో నిఖిల్ చాలా బాధపడ్డాడు. దీంతో ఏం చేయాలని చూస్తున్న సమయంలోనే హ్యాపీ డేస్ సినిమాలో శేఖర్ కమ్ముల అవకాశం కల్పించాడు. ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు నిఖిల్.

తనకు ఫస్ట్ ఛాన్స్.. ఫస్ట్ చెక్ శేఖర్ కమ్ముల ఇచ్చాడని నిఖిల్ గుర్తుచేసుకున్నాడు. అప్పటి పాతిక వేల చెక్‌ను డ్రా చేయకుండా ఇప్పటికీ అలాగే ఉంచుకున్నానని తెలిపాడు. శేఖర్ కమ్ముల నిజాయతీ కలిగిన మనిషి అని కితాబిచ్చాడు. హ్యాపీ డేస్ సినిమా తర్వాత వరుస అవకాశాలు వచ్చాయని.. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కిందని సంతోషం వ్యక్తం చేవాడు. ఇదంతా ఎలా జరిగిందా అని ఆలోచిస్తుంటా అని కూడా చెప్పుకొచ్చాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

18pages review | 18 పేజిస్‌ రివ్యూ.. నిఖిల్‌, అనుపమ మెస్మరైజ్‌ చేశారా?

Dhamaka review | రవితేజ ధమాకా రివ్యూ.. మళ్లీ ట్రాక్‌ ఎక్కాడా?

Kaikala Satyanarayana | కేజీఎఫ్ సినిమా సక్సెస్ అయితే కైకాలకు ఎందుకు సన్మానం చేశారు?

Kaikala Satyanarayana | హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చి.. ఆయన వల్లే విలన్‌గా మారిన కైకాల

Kaikala Satyanarayana | చిరంజీవిని కైకాల సత్యనారాయణ కోరిన చివరి కోరిక అదే.. ఎమోషన్ అయిన మెగాస్టార్

Exit mobile version