Home Lifestyle Do you know Money Plant | మనీ ప్లాంట్‌ను ఏ దిక్కున పెంచాలి? ఇది ఎండిపోతే ఏమవుతుంది?

Money Plant | మనీ ప్లాంట్‌ను ఏ దిక్కున పెంచాలి? ఇది ఎండిపోతే ఏమవుతుంది?

Money Plant | మనీ ప్లాంట్‌ మొక్కను చాలామంది అదృష్టంగా భావిస్తుంటారు. మనీ ప్లాంట్ లక్ష్మీదేవి ప్రతీక అని.. ఇది ఉన్న ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని విశ్వసిస్తుంటారు. అందుకే మనీప్లాంట్‌ను ఇంట్లో పెంచుకునేందుకు ఇష్టపడుతుంటారు. అయితే వీటిని ఎక్కడ పడితే అక్కడ పెంచకూడదు. దీనివల్ల సంపద రావడం అటుంచితే.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే దీన్ని సరైన చోట పెంచాలని చెబుతున్నారు.

ఏ దిక్కున పెంచాలి?

వాస్తు ప్రకారం మనీ ప్లాంట్‌ను ఈశాన్య దిక్కున అస్సలు ఉంచకూడదు. దీనివల్ల డబ్బులు రాకపోగా.. రుణాత్మక శక్తి పెరిగిపోయి అప్పుల్లో మునిగిపోతారు. ఇంట్లో వారు అనారోగ్యానికి గురవుతారు. అదే పడమర దిక్కులో ఉంటే భార్యభర్తల మధ్య విబేధాలు తలెత్తుతాయి. తూర్పు, ఉత్తర, దక్షిణ దిశలో మాత్రమే పెంచుకోవాలి. ఆగ్నేయ దిక్కులో పెంచితే కుజ, శుక్ర గ్రహాల అనుగ్రహం కలిగి ఆదాయం పెరుగుతుంది.

ఈ జాగ్రత్తలు అవసరం

మనీ ప్లాంట్ మొక్కను ఏ విధంగా కూడా భూమిని తాకనివ్వదు. కుండీల్లో లేదా నీళ్ల సీసాల్లో వీటిని పెంచడం మంచిది. మనీప్లాంట్ తీగను నేల మీద పాకించకూడదు. పందిరి ఎక్కించాలి. లేదా దారాలతో పైకి ఎక్కించాలి. అప్పుడే ఆర్థికంగా పురోభివృద్ధి కనిపిస్తుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు. అలాగే మనీప్లాంట్ ఎండిపోకుండా చూసుకోవాలి. దీనివల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకే మనీ ప్లాంట్‌కు రోజూ నీరు పోస్తూ ఉండాలి. ఎండిపోయిన ఆకులు ఎప్పటికప్పుడు తొలగించాలి. దీన్ని ఇంటి బయట, పెరటిలో పెంచడం కంటే కూడా ఇంటి లోపల లేదా బాల్కనీలో పెంచడం శ్రేయస్కరం.

ఇతరులకు ఇవ్వకూడదు

వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఇతరులకు ఇవ్వకూడదు. ఇది శుక్రుడికి కోపం తెప్పిస్తుందని చెబుతుంటారు. మనీప్లాంట్‌ను ఎవరి నుంచి ఉచితంగా తీసుకోవడం గానీ ఇతరులకు ఇవ్వడం గానీ చేయకూడదు. దీనివల్ల మనీప్లాంట్ ఇచ్చే వారి అదృష్టం.. తీసుకునేవారికి వెళ్లిపోతుందని అంటారు. అందుకే దీన్ని నర్సరీ నుంచి కొని తెచ్చుకోవాలి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Vasthu Tips | ఈశాన్యంలో బరువులు పెట్టవద్దని ఎందుకు అంటారు?

Vaasthu Tips | కొత్త ఇల్లు కొనేముందు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి

Vaasthu Tips | ఈ చెట్లు మీ ఇంట్లో ఉంటే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Exit mobile version