Home Entertainment Megastar Chiranjeevi | భోళా శంకర్ తర్వాత ఏంటి.. ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్న చిరంజీవి..!

Megastar Chiranjeevi | భోళా శంకర్ తర్వాత ఏంటి.. ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్న చిరంజీవి..!

Megastar Chiranjeevi | వాల్తేరు వీరయ్య ముందు వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు చిరంజీవి. ఒకేసారి మూడు నాలుగు ప్రాజెక్టులకు కమిట్ అయి.. అన్నింటికి డేట్స్ ఇచ్చి పూర్తి చేశాడు మెగాస్టార్. కానీ ఇప్పుడు ఈయన చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. అదే మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. బల్క్ డేట్స్ ఇవ్వడంతో గత నెల రోజుల నుంచి మెహర్ ఈ సినిమా పనిమీద బిజీగా ఉన్నాడు.

మరోవైపు చిరంజీవి కూడా భోళా శంకర్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నాడు. చిరంజీవి గత సినిమాలతో పోలిస్తే అత్యంత తక్కువ బడ్జెట్ తో వస్తుంది భోళా శంకర్. పైగా ఈ సినిమా కోసం చిన్నచిన్న టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. మణిశర్మ కొడుకు మహతి స్వర సాగర్ దీనికి సంగీతం అందిస్తున్నాడు.

చిరంజీవి ఈ సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోకుండా బిజినెస్ లో వాటా తీసుకుంటున్నాడు. మరోవైపు మెహర్ రమేష్ కు రెమ్యూనరేషన్ కాకుండా నెల జీతం ఇస్తున్నారు. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లిగా నటిస్తోంది. ఈ సినిమా మొత్తం బడ్జెట్ 30 కోట్ల లోపే ఉంటుందని తెలుస్తోంది.

ఇవన్నీ పక్కన పెడితే భోళా శంకర్ తర్వాత చిరంజీవి సినిమా ఏంటనే కన్ఫ్యూజన్ అందరిలోనూ ఉంది. అది మెగాస్టార్ లో కూడా బాగానే కనిపిస్తోంది. కన్ఫర్మ్ అనుకున్న వెంకీ కుడుముల సినిమా కథ నచ్చక ఆదిలోనే ఆగిపోవడంతో.. నెక్స్ట్ ప్రాజెక్ట్ పై డైలమాలో పడిపోయాడు మెగాస్టార్.
ఇప్పటి వరకు ఇంకో కథ ఓకే చేయలేదు. పూరీ జగన్నాథ్ కు స్క్రిప్ట్ సిద్ధం చేయాలని చెప్పిన చిరంజీవి.. కేవలం నెల రోజులు మాత్రమే టైం ఇచ్చాడు.

అంతేకాదు షూటింగ్ కూడా నెల రోజుల్లోనే పూర్తి చేయాలని అదిరిపోయే కండిషన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పని మీదే పూరి బిజీగా ఉన్నాడు. మరోవైపు కథ దొరికితే వినాయక్ దర్శకత్వంలో సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడు మెగాస్టార్.
గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన ఖైదీ నెంబర్ 150, ఠాగూర్ సినిమాలో మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం వినాయక్ ఫ్లాపుల్లో ఉన్నా కూడా ఆయన డైరెక్షన్ పై నమ్మకంతో చిరు ఈ నిర్ణయం తీసుకుంటున్నాడు.

ఏదేమైనా కూడా ఖాళీగా ఉన్న దర్శకుల వైపే చిరు అడుగులు పడుతున్నాయి.. కానీ బిజీగా ఉన్న డైరెక్టర్స్ ను మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. తన ఇమేజ్ ను బ్యాలెన్స్ చేస్తూ రొటీన్ కదా అయినా సరే ప్రేక్షకులకు నచ్చేలా చెప్పే దర్శకుడు అయితే చాలు అనుకుంటున్నాడు చిరంజీవి. మొత్తానికి ఈయన కన్ఫ్యూషన్ కు తెర పడాలంటే భోళా శంకర్ రిలీజ్ వరకు ఆగాలేమో. ఈ సినిమా ఆగస్టు 11న విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు దర్శక నిర్మాతలు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Sunil | సునీల్ ఇంక హీరోగా పనికిరాడా.. విలన్ గా సెటిల్ అయిపోతాడా..?

Junior NTR | రామ్‌చరణ్‌ను పిలిచి ఎన్టీఆర్‌ను ఆహ్వానించరా.. నందమూరి ఫ్యాన్స్‌ ఫైర్‌.. క్లారిటీ ఇచ్చిన హెచ్‌సీఏ

Samantha | సమంత రెండు చేతులకు గాయాలు.. రక్తం కారుతున్న ఫొటోలు షేర్ చేసిన కుందనపు బొమ్మ

Mrunal Thakur | అయ్యో రామా.. సీతకు ఎన్ని కష్టాలో.. ఒక హిట్టు ఇవ్వండయ్యా..!

Telugu Cinema | తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ కలిసి రావడం లేదా..?

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి.. ఎందుకంటే..

Rashmi Gautam | చేతబడి చేస్తా.. యాసిడ్‌ పోస్తా అంటూ జబర్దస్త్‌ యాంకర్‌పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌

Nayanthara | నయనతార సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా?

Medical Student Preethi | ఉద్రిక్త పరిస్థితుల నడుమ గిర్నితండాకు ప్రీతి మృతదేహం.. నా కూతుర్ని చంపేశారంటూ గుండెలవిసేలా రోదిస్తున్న తండ్రి

Exit mobile version