Home Entertainment Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి.. ఎందుకంటే..

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి.. ఎందుకంటే..

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కేంద్ర క్రీడా, యువజన శాఖ, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వచ్చారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా చిరంజీవి ఆహ్వానం మేరకు వాళ్ల ఇంటికి వెళ్లారు. అక్కడ అక్కినేని నాగార్జున, అల్లు అరవింద్‌తో కలిసి అనురాగ్ ఠాకూర్ భేటీ అయ్యారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి, ఇతర రాజకీయ, వ్యక్తిగత విషయాలను చర్చించినట్లు సమాచారం. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అనురాగ్ ఠాకూర్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.

‘ హైదరాబాద్ పర్యటనలో భాగంగా అనురాగ్ ఠాకూర్ మమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. నా సోదరుడు అక్కినేని నాగార్జునతో కలిసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సాధిస్తున్న పురోగతి చర్చించడం ఆనందంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు.

చాలాకాలంగా చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత పూర్తి ఫోకస్ సినిమాపైనే పెట్టాడు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో మాత్రం సత్సంబంధాలను మెయింటైన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులను కలుస్తున్నారు.

Exit mobile version