Home Entertainment Telugu Cinema | తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ కలిసి రావడం లేదా..?

Telugu Cinema | తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ కలిసి రావడం లేదా..?

Telugu Cinema | సినిమా ఇండస్ట్రీలో అన్నిటికంటే బలంగా నమ్మేది సెంటిమెంట్. ఒకసారి కలిసి వస్తే దాని వైపు అడుగులు వేస్తుంటారు. ఒకవేళ కలిసి రాలేదంటే మాత్రం చచ్చిన అటువైపు చూడరు మన హీరోలు, దర్శకులు. మరీ ముఖ్యంగా సినిమా టైటిల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు దర్శక నిర్మాతలు. అలాంటిది ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో ఇంగ్లీష్ టైటిల్స్ అసలు కలిసి రావడం లేదు.

ఇదే విషయం అర్థం చేసుకున్న కొందరు దర్శకులు తమ సినిమాలకు తెలుగు లేదంటే ఇతర భాష టైటిల్స్ వైపు అడుగులు వేస్తున్నారు.. కానీ ఇంగ్లీష్ మాత్రం వద్దు అనుకుంటున్నారు. ఈ మధ్య విడుదలైన కళ్యాణ్ రామ్ అమిగోస్ ఎప్పుడొచ్చి వెళ్లిపోయిందో కూడా జనాలకు గుర్తులేదు. ఈ సినిమా ఎలా ఉంది అనే విషయం పక్కన పెడితే.. ముందు టైటిల్ ఎవరికి అర్థం కాలేదు. అమిగోస్ అంటే ఏంటి అంటూ గూగుల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

అలాగే గతేడాది నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ది ఘోస్ట్ కూడా ఇంగ్లీష్ టైటిల్. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా నిరాశ పరిచింది. దానికి ముందు నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ పరిస్థితి ఇదే. దాంతో దెబ్బకు తన తర్వాత సినిమాకు గాండీవదారి అర్జున అంటూ అచ్చమైన తెలుగు టైటిల్ పెట్టాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు.

ఇక సుధీర్ బాబు నటించిన హంట్ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది. సంతోష్ శోభన్ హీరోగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమా కనీసం ఒక్కరోజు కూడా ఆడలేదు. అలాగే రామ్ లింగస్వామి కాంబినేషన్లో వచ్చిన ది వారియర్ సినిమా దారుణంగా నిరాశ పరిచింది. నాగ చైతన్య, విక్రమ్ కే కుమార్ కాంబినేషన్లో వచ్చిన థాంక్యూ వాళ్ళిద్దరి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది.

ఇవి మాత్రమే కాదు విజయ్ దేవరకొండ, పూరి కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ సినిమా అదే స్థాయిలో డిజాస్టర్ అయింది. ఆది సాయికుమార్ టాప్ గేర్, ఎమ్మెస్ రాజు 7 డేస్ 6 నైట్స్, కొత్తవాళ్లు నటించిన బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇంగ్లీష్ టైటిల్స్ తో తెరకెక్కిన సినిమాలలో హిట్ అయినవి ఒకటో రెండో ఉంటే.. ఫ్లాప్ అయినవి మాత్రం పదుల సంఖ్యలో ఉన్నాయి. అందుకే ఇంగ్లీష్ టైటిల్స్ వైపు అడుగులు వేయడం లేదు మన దర్శక నిర్మాతలు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి.. ఎందుకంటే..

Rashmi Gautam | చేతబడి చేస్తా.. యాసిడ్‌ పోస్తా అంటూ జబర్దస్త్‌ యాంకర్‌పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌

Nayanthara | నయనతార సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా?

Medical Student Preethi | ఉద్రిక్త పరిస్థితుల నడుమ గిర్నితండాకు ప్రీతి మృతదేహం.. నా కూతుర్ని చంపేశారంటూ గుండెలవిసేలా రోదిస్తున్న తండ్రి

Medical Student Preethi | సీనియర్లంతా ఒక్కటయ్యారు అమ్మా.. ఆత్మహత్యకు ముందు ఫోన్‌ చేసి బాధపడ్డ ప్రీతి

Triangle Love Story | నవీన్ హత్యలో నిహారికనే సూత్రధారి.. హరిహర కృష్ణ తండ్రి సంచలన ఆరోపణలు

Exit mobile version