Home Entertainment Pawan Kalyan | కష్టపడిన.. డేట్స్ ఇచ్చిన.. సినిమాలు చేస్తున్న.. అంటున్న పవన్ కళ్యాణ్ !

Pawan Kalyan | కష్టపడిన.. డేట్స్ ఇచ్చిన.. సినిమాలు చేస్తున్న.. అంటున్న పవన్ కళ్యాణ్ !

Pawan Kalyan | ఈ మాటలు వింటుంటే తెలంగాణ మంత్రి మల్లారెడ్డి గుర్తుకు వస్తున్నాడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇదే చేస్తున్నాడు. అదెలా అబ్బా అనుకుంటున్నారా..! ఈయన కూడా ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేయడానికి చాలా కష్టపడుతున్నాడు. 2024 లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇదే ఎడాది అన్ని సినిమాలు పూర్తి చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడు పవర్ స్టార్.

ఆయన అనుకుంటే అయిపోతుందా.. ఈరోజుల్లో స్టార్ హీరోలు ఒక సినిమా చేయడానికి కనీసం ఏడాది పడుతుంది కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రణాళికలు మాత్రం వేరేలా ఉన్నాయి. తనతో సినిమా చేయాలంటే నెల రోజులకు మించి డేట్స్ ఇవ్వలేదని ముందుగానే దర్శక నిర్మాతలకు చెప్పేశాడు పవన్ కళ్యాణ్. ఈ కండిషన్స్ కు ఒప్పుకున్న వాళ్లే పవన్ తో సినిమాలకు కమిట్ అవుతున్నారు.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది. ఇది రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగం 2023లో విడుదల చేసి.. రెండో భాగాన్ని ఎన్నికల తర్వాత రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు క్రిష్.

మరోవైపు సముద్ర కని తెరకెక్కిస్తున్న వినోదయ సీతం రీమేక్ షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఫిలింనగర్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి కీలకమైన సన్నివేశాల్లో పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇక మార్చి మొదటి వారం నుంచి హరీష్ శంకర్ సినిమాకు డేట్స్ ఇచ్చాడు పవర్ స్టార్. ఈ సినిమా కోసం 34 రోజులకు కాల్ షీట్స్ ఇచ్చాడు ఈయన. ఈ లోపు సినిమా పూర్తి చేయాలి అనేది హరీష్ శంకర్ కు పవన్ పెట్టిన కండిషన్.

ఇక ఏప్రిల్ మొదటి వారం నుంచి సుజిత్ ఓ జి సినిమాకు డేట్స్ ఇచ్చాడు పవన్. దీనికోసం కూడా కేవలం 32 రోజులు మాత్రమే ఇచ్చాడు జనసేనాని. ఇది కూడా రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగం 2023 దసరాకు విడుదల చేసి రెండో భాగం ఎన్నికల తర్వాత ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఒక్కో సినిమాకు పవన్ కళ్యాణ్ తక్కువలో తక్కువ 60 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

వినోదయ సీతం రీమేక్ కోసం 20 రోజుల డేట్స్ ఇచ్చిన పవన్ 60 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నాడు. అంటే రోజుకు మూడు కోట్లు అన్నమాట. అలాగే ఓజి కోసం 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు పవన్. ఇలా ఏ సినిమా తీసుకున్న పవర్ స్టార్ పారితోషికం మాత్రం ఎక్కువగానే ఉంది.

ఎన్నికల సందర్భంగా ఖర్చుల కోసం డబ్బులు కావాలన్నా.. పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నా ఆయనకు డబ్బులు కచ్చితంగా కావాల్సిందే. అందుకే ఒప్పుకున్న సినిమాలను తొందరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు పవర్ స్టార్.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Sunil | సునీల్ ఇంక హీరోగా పనికిరాడా.. విలన్ గా సెటిల్ అయిపోతాడా..?

Junior NTR | రామ్‌చరణ్‌ను పిలిచి ఎన్టీఆర్‌ను ఆహ్వానించరా.. నందమూరి ఫ్యాన్స్‌ ఫైర్‌.. క్లారిటీ ఇచ్చిన హెచ్‌సీఏ

Samantha | సమంత రెండు చేతులకు గాయాలు.. రక్తం కారుతున్న ఫొటోలు షేర్ చేసిన కుందనపు బొమ్మ

Mrunal Thakur | అయ్యో రామా.. సీతకు ఎన్ని కష్టాలో.. ఒక హిట్టు ఇవ్వండయ్యా..!

Telugu Cinema | తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ కలిసి రావడం లేదా..?

Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి.. ఎందుకంటే..

Rashmi Gautam | చేతబడి చేస్తా.. యాసిడ్‌ పోస్తా అంటూ జబర్దస్త్‌ యాంకర్‌పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌

Nayanthara | నయనతార సినిమాలకు గుడ్‌బై చెప్పనుందా?

Medical Student Preethi | ఉద్రిక్త పరిస్థితుల నడుమ గిర్నితండాకు ప్రీతి మృతదేహం.. నా కూతుర్ని చంపేశారంటూ గుండెలవిసేలా రోదిస్తున్న తండ్రి

Exit mobile version