Shruti Haasan | శ్రుతి హాసన్ అనారోగ్య సమస్య ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. మొన్న వీరసింహారెడ్డి సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న శ్రుతిహాసన్ ఆ తర్వాత అస్వస్థతకు గురైంది. అందుకే వాల్తేరు వీరయ్య సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు రాలేకపోయింది. అప్పుడే శ్రుతి హాసన్ తన అనారోగ్య సమస్యను బయటపెట్టింది. జ్వరంతో బాధపడుతున్నానని.. కరోనా కాకపోతే సంతోషిస్తానంటూ ట్వీట్ చేసింది. కానీ తన అనారోగ్య సమస్యను పలు మీడియా సంస్థలు వక్రీకరించాయి. శ్రుతిహాసన్ మానసిక సమస్యలతో బాధపడుతుందంటూ రాసుకొచ్చాయి. ఈ కథనాలు తన వరకు చేరడంతో శ్రుతిహాసన్ స్పందించింది.
మొత్తానికి నా జ్వరం ( ఫ్లూ ) కాస్త ఇలా మానసిక సమస్యగా మారిందన్నమాట అంటూ శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. తన ఆరోగ్యంపై వచ్చిన తప్పుడు వార్తలకు సంబంధించిన కథనాల స్క్రీన్‌షాట్స్‌ను షేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేసింది. తనకు ఎలాంటి మానసిక సమస్య లేదంటూ స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేసింది. వీటివల్లనే చాలామంది తమ మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను బయటపెట్టడానికి భయపడతున్నారని తెలిపింది. ‘ నేను ఎప్పుడూ కూడా ఒక మానసిక నిపుణురాలిగా వ్యవహరిస్తుంటాను. అన్ని విధాలుగా నన్ను నేను సంరక్షించుకుంటాను.

అందుకే నేను ఏ విధంగానూ మానసిక అనారోగ్యానికి గురి కాలేదు. కేవలం వైరల్ ఫీవర్ తోనే ఇబ్బంది పడుతున్నా. నన్ను ఇబ్బంది పెట్టడానికి బాగా ప్రయత్నించారు. అవసరమైతే మీరే ఒకసారి థెరపిస్టును కలవడం మంచిది ‘ అంటూ పోస్టులో రాసుకొచ్చింది.
కమల్ హాసన్ కూతురు అయినప్పటికీ తండ్రి పేరును ఎక్కడ కూడా ఉపయోగించుకోకుండా కెరీర్‌ని స్టార్ట్ చేసింది శ్రుతి హాసన్. అయితే మొదట్లో ఆమె సినిమాలు పరాజయాలు కావడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. కానీ ఆ విమర్శలను తట్టుకుని నిలబడింది. గబ్బర్ సింగ్ తరువాత ఈ భామ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.
అగ్ర హీరోలందరితో జత కట్టింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా సంక్రాంతి బరిలో నిలిచిన చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి రెండు సినిమాల్లోనూ హీరోయిన్‌గా నటించింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Waltair Veerayya | వాల్తేరు వీరయ్య సినిమా ఓటీటీకి వచ్చేది అప్పుడే..
Waltair Veerayya Review | వాల్తేరు వీరయ్య రివ్యూ.. చిరంజీవి, రవితేజ పూనకాలు తెప్పించారా?
Aishwarya lekshmi | విలన్‌తో ఐశ్వర్య లక్ష్మీ ప్రేమలో ఉందా? ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుకు అర్థమేంటి?
Veerasimha reddy Review | వీరసింహారెడ్డి రివ్యూ.. బాలయ్య మాస్ ఫార్ములా వర్కవుట్ అయ్యిందా?
Upasana Konidela | పుట్టబోయే బిడ్డ గురించి ఎమోషనల్ అయిన ఉపాసన.. ట్వీట్ వైరల్
Srinidhi shetty | కేజీఎఫ్ బ్యూటీకి టాలీవుడ్ నుండి భారీ ఆఫర్.. ఇక్కడైనా అదృష్టం కలిసి వస్తుందా?